వరుసగా పెరిగిపోతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Today Gold and Silver Rates: గత పదిరోజుల్లో ఒకటీ రెండు రోజులు పసిడి ధరలు పెరిగినా.. వరుసగా తగ్గుతూ వచ్చింది. నిన్నటి నుంచి పసిడి ధరలు మళ్లీ షాక్ ఇస్తు పెరిగిపోయాయి.

Today Gold and Silver Rates: గత పదిరోజుల్లో ఒకటీ రెండు రోజులు పసిడి ధరలు పెరిగినా.. వరుసగా తగ్గుతూ వచ్చింది. నిన్నటి నుంచి పసిడి ధరలు మళ్లీ షాక్ ఇస్తు పెరిగిపోయాయి.

ప్రపంచంలో గోల్డ్ అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి పండుగ, శుభకార్యాలకు మహిళలు తమ స్థాయికి తగ్గట్టుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల వరుసగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, యుద్దాల ప్రభావం బంగారం, వెండి పై పడటంతో తరుచూ ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. వివరాల్లోకి వెళితే..

గత నెల నుంచి శ్రావణ మాసం మొదలు కావడంతో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ నెల వరుసగా తగ్గుతూ వస్తున్న పుత్తడి ధరలు రెండు రోజులుగా షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం పసిడి ధర ఏకంగా రూ.75 వేలకు చేరువు అయ్యింది. దీంతో కొనుగోలుదారులు కన్ఫ్యూజ్ పడిపోయారు. మళ్లీ తగ్గే అవకాశం ఏదైనా ఉందా అన్న ఆలోచనలో ఉన్నారు. రెండు రోజుల్లోనే రూ.1500 వరకు పెరిగింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రూ. 68,650కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,890 గా ఉంది. ఏపీ, తెలంగాణలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 68,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,890 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పసిడి, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,800 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.75,040 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,650 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 74,890 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,650 వద్ద ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.74,890 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. చెన్నై, హైదరాబాద్, వరంగల్, విశాఖలో రూ. 97,000, ముంబై, కేరళా, ఢిల్లీలో కిలో వెండి రూ. 92000 వద్ద కొనసాగుతుంది.

Show comments