iDreamPost
android-app
ios-app

స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజ ధరలు ఎలా ఉన్నాయంటే!

  • Published Oct 16, 2023 | 10:39 AM Updated Updated Oct 16, 2023 | 10:39 AM
  • Published Oct 16, 2023 | 10:39 AMUpdated Oct 16, 2023 | 10:39 AM
స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజ ధరలు ఎలా ఉన్నాయంటే!

భారత దేశంలో బంగారం కొనేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ లో బంగారు ఆభరణాలు కొనడానికి మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో పిసిడి ప్రియులు ఆందోళనలో ఉంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితలు, డాలర్ విలువకు అనుగుణంగా పసిడి ధరలు ఎప్పటికప్పుడు మార్పులు చెందుతున్నాయి. ఇటీవల ఇజ్రయెల్-పాలస్తీన ల మధ్య కొనసాగుతున్న యుద్దం వల్ల బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సోమవారం మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

గత నెలలో బంగారం ధరలు వరుస గా తగ్గుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఇజ్రయెల్-పాలస్తీనా ల మధ్య యుద్దం మొదలైందో.. అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడటం వల్ల పసిడి ధరలు ఒక్కసారే పెరిగిపోతూ వచ్చాయి. ఒక్క వారంలోనే ఏకంగా 3 వేల వరకు పెరిగింది. ఆదివారం పసిడి ధర ఒక్కసారే రూ. 1530 రూపాయలు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,410 కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,450 కి చేరింది. ఇదే నగరాల్లో కిలో వెండి ధర రూ.77 వేల వరకు కొనసాగుతుంది.

దేశంలోని ముఖ్యనగరాల్లో నేడు బంగారం ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,560 కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,600 కి కొనసాగుతుంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,410లు ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,450 కి కొనసాగుతుంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,410లు ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,450 కి ట్రెండ్ అవుతుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,560లు ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,610 కి ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో కిలో వెండి రూ.74,100, చెన్నైలో కిలో రూ.77,000, బెంగుళూరులో కిలో రూ.71,500,ముంబై, కోల్‌కొతాలో 74,100 గా ట్రెండ్ అవుతుంది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş