పసిడి ప్రియులకు శుభవార్త.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు.. నేడు ఎంతంటే?

Gold and Silver Rates in Hyderabad: గత వారం రోజులుగా పసిడి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. గత నెలతో పోల్చితే ఈ నెల బంగారం, వెండి ధరలు నేల చూపు చూస్తున్నాయి.

Gold and Silver Rates in Hyderabad: గత వారం రోజులుగా పసిడి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. గత నెలతో పోల్చితే ఈ నెల బంగారం, వెండి ధరలు నేల చూపు చూస్తున్నాయి.

భారతీయులు సహజంగానే ప్రసిడి ప్రియులు. పసిడి ధరలు తరుచూ పెరుగుతూ వస్తున్న కొనుగోలు మాత్రం ఎక్కడా ఆపరు. అందుకే దేశంలో జ్యులరీ షాపులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. మగువలకు నచ్చే విధంగా రోజు రోజు కీ కొత్త కొత్త డిజైన్లతో బంగారు ఆభరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. శ్రావణ మాసం వేళ పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలు కావండంతో మళ్లీ పసిడి, వెండి కొనుగోలు ఎక్కువైంది. అయితే గత వారం రోజులుగా పసిడి మెల్లి మెల్లిగా పతనవమవుతూ వస్తుంది. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో ఇటీవల బంగారం ధరలు అమాంత పెరిగిపోయాయి. మేలిమి బంగారం ఏకగా రూ.73 వేలకు చేరుకుంది. అదృష్టం కొద్ది వారం రోజులుగా పసిడి పతనమవుతూ వస్తుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు శాతం కూడా పెరిగిపోయింది. మహిళలక మరో శుభవార్త.. నిన్నటితో పోల్చుకుంటే పుత్తడి ధర ఓమోస్తారుగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.10 దిగివచ్చింది. ప్రస్తుతం రూ.66,690కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.10 దిగివచ్చింది. ప్రస్తుతం రూ.72,760 కి చేరింది. ఏపీ, తెలంగాణలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,760 వద్ద కొనసాగుతుంది.

దేశలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,840 కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,910  వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, పూణే, కేరళా లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690 కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,760వద్ద కొనసాగుతుంది. చెన్పైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690 కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,760వద్ద కొనసాగుతుంది.  ఇక కిలో వెండి ధర రూ.100 తగ్గింది. చెన్నై, కేరళా, హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 90,800, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 85,900, ముంబైలో రూ.85,900, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.82,900 వద్ద కొనసాగుతుంది.

Show comments