iDreamPost
android-app
ios-app

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవల ఆకాశాన్నంటిన పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం ఎంతుందంటే?

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇటీవల ఆకాశాన్నంటిన పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం ఎంతుందంటే?

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

ఇటీవల అంతకంతకూ పెరుగుతూ పసిడిప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట లభించనుంది. నేడు బంగారం, వెండి ధరలు స్పల్పంగా తగ్గాయి. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనేందుకు ఇంట్రస్తు చూపిస్తుంటారు భారతీయులు. పండగలు, పెళ్లిల్లు, ఇతర వేడుకల సందర్భాల్లో బంగారం కొనుగోళ్లు పెరుగుతూ ఉంటాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో భారీ లాభాలు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనిపెట్టుకుంటే ఆపద సమయంలో ఆదుకుంటుందనడంలో సందేహం లేదు. మరి నేడు తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తులంపై రూ. 10 తగ్గింది. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో రూ. 72,640వద్దకు చేరింది. ఇదే సమయంలో 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరపై రూ. 10 తగ్గడంతో రూ. 66,590వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 72,640గా ఉంది. 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,590 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.72,790 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,740 వద్ద ట్రేడ్ అవుతోంది.

today gold rates

పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గతకొద్ది రోజుల క్రితం బంగారంతో పాటు వెండి కూడా పరుగులు తీసింది. దీంతో కిలో వెండి లక్ష రూపాయలు దాటుతుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతానికైతే వెండి ధరలు తగ్గుతున్నాయి. నేడు కిలోవెండిపై 100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండిపై రూ. 100 తగ్గి 96,100 వద్ద అమ్ముడవుతోంది. అదే విధంగా విజయవాడ, ముంబై, చెన్నై నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. హస్తినలో కిలో వెండి ధర రూ. 91,600 వద్ద ట్రేడ్ అవుతోంది.