Home Loan కావాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ తక్కువ! ఎంతంటే?

Home Loan: ఇల్లు కొనడానికి చాలా మంది కూడా హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇచ్చే బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి.

Home Loan: ఇల్లు కొనడానికి చాలా మంది కూడా హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు. అయితే తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇచ్చే బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి.

హోమ్ లోన్ అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కసారి తీసుకున్నాం అంటే ఎన్నో సంవత్సరాల పాటు నెలవారీ ఈఎంఐలు కట్టాల్సిందే. ఈ రోజుల్లో హోమ్ లోన్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉంటుందో కచ్చితంగా ముందే పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే 1 శాతం వడ్డీ రేటు తగ్గినా కూడా లక్షల్లో డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. లోన్ అప్లై చేసే ముందే తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకునే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఈ సంవత్సరం ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకి హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సిటీ యూనియన్ బ్యాంక్ తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తుంది. ఈ బ్యాంక్ లో 8.25 శాతం నుంచి 10.50 శాతం దాకా వడ్డీ పడుతుంది. మంచి సిబిల్ స్కోర్ మైన్టైన్ చేసే శాలరీ ఎంప్లాయ్స్ కి సిటీ యూనియన్ బ్యాంక్ 8.25 శాతం వడ్డీకి లోన్ ఇస్తుంది. అయితే సిబిల్ స్కోర్ యావరేజ్ గా ఉన్న శాలరీ ఎంప్లాయ్స్ కి 10.50 శాతం వడ్డీకి హోమ్ లోన్ అందిస్తుంది. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్స్ అంటే బిజినెస్ లు చేస్తూ మంచి సిబిల్ స్కోర్ మైన్టైన్ చేసేవారికి 8.25 శాతం వడ్డీకి హోమ్ లోన్ ఇస్తుంది సిటీ యూనియన్ బ్యాంక్. వారి మీద సిబిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్న వారికి మాత్రం 10.50 శాతానికి లోన్ ఇస్తుంది ఈ బ్యాంక్. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా హోమ్ లోన్ ని తక్కువ వడ్డీ శాతానికి ఇస్తుంది. ఈ బ్యాంక్ శాలరీ ఎంప్లాయిస్ కి 8.35 శాతం నుంచి 10 శాతం దాకా లోన్ ఆఫర్ చేస్తుంది. సిబిల్ స్కోర్ బాగా మెరుగ్గా ఉన్నవారికి 8.35 శాతం ఇక కొంచెం తక్కువగా ఉన్న వారికీ 10 శాతానికి హోమ్ లోన్ ఇస్తుంది. ఇక సెల్ఫ్ ఎంప్లాయ్స్ కి కూడా వారి సిబిల్ స్కోర్ ఆధారంగా 8.35 శాతం నుంచి 10 శాతం దాకా లోన్ ఇస్తుంది.

ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే శాలరీ ఎంప్లాయీస్ కి 8.35 శాతం నుంచి 10.40 శాతం దాకా హోమ్ లోన్ పై వడ్డీ విధిస్తుంది. ఇక సెల్ఫ్ ఎంప్లాయీస్ కి అయితే 8.45 శాతం నుంచి 10.90 శాతం దాకా వడ్డీని విధిస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లతో లోన్ ఇస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అయితే హోమ్ లోన్స్ పై 8.35 శాతం నుంచి 10.75 శాతం దాకా వడ్డీ రేట్లు ఉన్నాయి. శాలరీ ఎంప్లాయీస్ కి సెల్ఫ్ ఎంప్లాయీస్ కి ఇవే వడ్డీ రేట్లు అప్లై అవుతాయి. ఇక ఇండియన్ బ్యాంక్ అయితే శాలరీ ఎంప్లాయీస్ కి 8.40 శాతం నుంచి 9.80 శాతంతో హోమ్ లోన్ అందిస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్ కి అయితే 8.90 శాతం నుంచి 10.30 శాతం వడ్డీతో హోమ్ లోన్ ఇస్తుంది. కాబట్టి హోమ్ లోన్ కావాలనుకునేవారు ఈ బ్యాంకుల నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ బ్యాంక్స్ లోన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments