Tirupathi Rao
టాటా పంచ్ ఈవీ కారు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆ కారు ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే వినియోగదారులు క్యూ కట్టాల్సిందే.
టాటా పంచ్ ఈవీ కారు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆ కారు ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే వినియోగదారులు క్యూ కట్టాల్సిందే.
Tirupathi Rao
కారు కొనాలి అనే ఆలోచన రాగానే అందరి మదిలోకి గుర్తొచ్చే కంపెనీ టాటా అనే చెప్పాలి. ఎందుకంటే భద్రత, ఫీచర్స్ విషయంలో టాటా కార్లు వినియోగదారుల నమ్మకాన్ని గెలిచారు. ముఖ్యంగా టాటా కారులో ప్రయాణం అంటే మనం సేఫ్ అనే ముద్ర పడిపోయింది. అలాగే ఇప్పుడు అందరూ ఈవీ కార్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఫ్యూయల్ భారం ఉండదు, పర్యావరణం బాగుంటుంది అనే కారణాల చేత వాహనదారులు ఎలక్ట్రిక్ కార్లు కొనాలని చూస్తున్నారు. అలాంటి వారికోసం ఇప్పుడు టాటా నుంచి కొత్తగా పంచ్ ఈవీ విడుదలైంది. ఈ పంచ్ ఈవీ ధర ఎంత? దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? దాని ఫీచర్స్ ఏంటో చూద్దాం.
టాటా పంచ్ కారుకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే 3 లక్షల యూనిట్స్ అమ్మి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ఎలక్ట్రిక్ మోడల్ తో రాబోతోంది. అందుకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. అలాగే బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. టాటా పంచ్ ఈవీ కొనాలి అనుకునే వాళ్లు రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టాటా పంచ్ ఈవీ లుక్స్ మెస్మరైజింగా ఉన్నాయి. ఎంతో ఫ్యూచరిస్టిక్ లుక్స్ తో వాహనదారులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఇది గ్రీన్ కలర్ లో ఉండటం కూడా ఎంతో మందిని ఇంప్రెస్ చేస్తోంది.
ఈ పంచ్ ఈవీని కూడా నెక్సన్ తరహాలోనే రెండు వర్షన్స్ లో విడుదల చేయబోతున్నారు. 25 కిలో వాట్ పర్ అవర్ ఒక వర్షన్ అయితే.. 35 కిలో వాట్స్ పర్ అవర్ రెండో వర్షన్ ఉంటుందని చెబుతున్నారు. 35KWH వర్షన్ తో అత్యధిక రేంజ్ లభిస్తుంది. ఈ కారు 300 కిలోమీటర్ల నుంచి 600 కిలీమీటర్ల రేంజ్ తో వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కారుకు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి అయితే చెప్పడం లేదు. కానీ, అత్యధిక రేంజ్, సూపర్బ్ ఫీచర్స్ ఉంటాయని మాత్రం హామీ ఇస్తున్నారు. ఈ టాటా పంచ్ ఈవీకి సంబంధించి చాలానే లీకులు బయటకు వస్తున్నాయి. ఈ ఈవీ ఆ సెగ్మెంట్ లోనే ప్రత్యేకంగా నిలబోతోందని చెబుతున్నారు.
10.25 బిగ్గెస్ట్ టచ్ స్క్రీన్ తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుందంటున్నారు. అలాగే 10.23 ఇంచెస్ వర్చువల్ కాక్ పిట్, సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరాతో వస్తోంది. ఇందులో లెవల్ 2 ADAS టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ 5జీ కనెక్టివిటీకి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే వెహికిల్ టూ లోడ్, వెహికిల్ టూ వెహికిల్ ఛార్చింగ్ సపోర్ట్ కూడా ఈ కారులో ఉంటుంది. ఇంక సేఫ్టీ విషయానికి వస్తే.. ఇప్పటికే టాటా పంచ్ కారుకు గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ లో 5 స్టార్ రేటింగ్ ఉంది. అలాగే ఈ టాటా పంచ్ ఈవీకి కూడా 5 స్టార్ రేటింగ్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా మరిన్ని సేఫ్టీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తోనే ఈ టాటా పంచ్ ఈవీ ఉంటుందని చెబుతున్నారు. ఈ కారు ధర విషయానికి వస్తే.. రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఈ కారు ధర ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి.. టాటా పంచ్ ఈవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Tata Motors has officially commenced the bookings of its upcoming electric model, the Punch EV in India. The all-electric SUV is available to book for a token amount of Rs. 21,000. The prices of the Punch EV are expected to be revealed in the coming weeks. pic.twitter.com/yK9Fi2Dfk4
— Autophare (@autophareind) January 5, 2024