EPFO ఖాతాదారులకు అదిరిపోయే ఇన్సూరెన్స్ స్కీమ్.. ఎన్ని లక్షలంటే..?

EPFO Special Insurance Scheme: దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు భవిష్యత్ లో రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

EPFO Special Insurance Scheme: దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు భవిష్యత్ లో రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

భారత దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న చేస్తున్న ఉద్యోగస్తులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రతి నెల ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమచేస్తూ ఉంటాయి. దీని ద్వారా ఉద్యోగస్తులకు రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా ఉంటుంది. అంతేకాదు అత్యవసరంగా ఏదైనా అవసరాలు ఉంటే పీఎఫ్ ఖాతా నుంచి కొంత డబ్బు తీసుకునే సదుపాయం కల్పించబడింది. ప్రతి పీఎఫ్ ఖాతాదారుడికి ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈపీఎఫ్ఓ పథకంలో ఉద్యోగుల ప్రయోజనం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. అదేంటో చూద్దాం.. వివరాల్లోకి వెళితే..

ఈపీఎఫ్ఓ‌ ఖాతాదారుల కోసం అదిరిపోయే ఇన్స్‌రెన్స్ స్కీమ్ ఉంది. ఈపీఎఫ్ పథకంలో క్రమం తప్పకుండా జమ చేసే సభ్యులకు 7 లక్షల వరకు బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లీంక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ అంటారు. రూ.15,000 లోపు బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులందరికీ ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్ లో చేరే ఖాతాదారుడి బేసిక్ శాలరీ రూ.15,000 కంటే ఎక్కువ ఉంటే గరిష్ట ప్రయోజనం రూ.6 లక్షల వరకు ఉంటుంది. ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్ఐ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈడీఎల్ఐ లెక్కింపు ఇలా చేస్తారు. బీమా మొత్తం 12 నెలల ప్రాథమిక జీతం, డిఏపై డిపెండ్ అయి ఉంటుంది. బీమా కవరేజ్ క్లయిమ్ చివరి ప్రాథమిక జీతం, డీఏ కన్నా ఎక్కువగా ఉంటుంది. రూ.1 లక్ష 75 వేల వరకు ఖాతాదారుడుకి  బోనస్ కింద చెల్లిస్తారు. పన్నెండు నెలలు  ప్రాథమిక జీతం + డీఏ రూ.15 వేలు అయితే, బీమా క్లయిమ్ మొత్తం (35×15000) + 1,75,000 కలిపి మొత్తం ఏడు లక్షలు అవుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోతే అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు బీమా క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం నామినీ వయసు కనీసం 18 ఏళ్లు దాటి ఉండాలి. తక్కువ ఉంటే.. అతని తరుపు తల్లిదండ్రులు క్లయిమ్ చేసుకోవచ్చు. క్లయిమ్ కోసం మరణ ద్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుంది. మైనర్ అయితే గార్డియన్ తరుపు చేస్తే మాత్రం సంరక్షణ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ వివరాలు అందించాల్సి ఉంటుంది.

EDLI స్కీమ్ ప్రయోజనాలు :

  • ఈ స్కీమ్ లో చేరిన మెంబర్ ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు
  • ఈడీఎల్ఐ స్కీమ్ కింద క్లయిమ్ మొత్తం 12 నెలల సగటు నెలవారీ చెలంపు కంటే 35 రెట్లు గరిష్టంగా
  • ఈ పథకం కిద ర.1,50,00 బోనస్ ఇస్తారు. ఏప్రిల్ 28,2021 నుంచి బోనస్ రూ.1.75 లక్షలు పెంచారు
  • ఈడీఎల్ఐసీ లెక్కింపు బేసిక్ పే కి డియర్ నెస్ అలవెన్స్ వర్తింపజేస్తారు.
  • ఉద్యోగులందరికీ రూ.7 లక్షల క్లెయిమ్ మొత్తం లభించదు.. ఇది ఫార్మాల ద్వారా లెక్కిస్తారు.
Show comments