Modi Gov Reduce Petrol, Diesel Price 2024: మోదీ న్యూఇయర్ కానుక.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎంతంటే

Petrol Diesel Price: మోదీ న్యూఇయర్ కానుక.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎంతంటే

పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతోన్న ప్రజలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పనుంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతోన్న ప్రజలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పనుంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

ప్రస్తుతం మార్కెట్ లో నిత్యవసరాలు మొదలు కూరగాయలు, పెట్రోల్, డీజిల్ వంటి వాటి రేట్లు భారీగా పెరిగాయి. ఈ ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలైతే పెరగడమే తప్ప తగ్గడం తెలీదన్నట్లుగా పరుగులు తీస్తున్నాయి. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల వరి సాగు తగ్గడంతో.. బియ్య ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో బియ్యం ధర 70 రూపాయలకు పైగా పలుకుతోంది. పెరుగుతున్న నిత్యవసర ధరలకు కళ్లెం వేసేందుకు మోదీ ప్రభుత్వం భారత్ రైస్, దాల్, ఆటా పేరుతో బియ్యం, గోధుమ పిండి, పప్పులను తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు రెడీ అయ్యింది. అలానే గ్యాస్ సిలిండర్ ధరను కూడా భారీగా తగ్గించిన మోదీ సర్కార్.. త్వరలోనే మరో శుభవార్త చెప్పనుంది. నూతన సంవత్సర కానుకగా.. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గంచనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతోన్న ప్రజలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పనుంది. పెట్రోల్, డీజిల్ ఒక్కో లీటర్‌పై 10 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సర కానుకగా.. మోదీ ఈ ప్రకటన చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్త కథనాలు వెలువడ్డాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇప్పటికే ప్రధాని మోదీకి సమర్పించిందని వార్తలు వస్తున్నాయి. పీఎం ఆ ప్రతిపాదనలను పరిశీలించి గురువారం (డిసెంబర్ 28) ఆమోదం తెలిపారని జాతీయా మీడియా వెల్లడించింది. ఇక డిసంబర్ 31, జనవరి 1లోపు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

వచ్చే ఏడాది మార్చిలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్.. ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. న్యూఇయర్ గిఫ్ట్ గా ఇది ఆచరణలోకి రానుంది అంటున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ఆయా నగరాలను బట్టి రూ. 96 నుంచి రూ. 112 వరకు ఉంది. గురువారం (డిసెంబర్ 28) దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.72 ఉండగా.. ముంబైలో రూ. 111.35గా ఉంది. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర రూ. 89 నుంచి రూ.100 రూపాయల వరకు ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 89.62 ఉండగా.. ముంబైలో రూ. 97.28గా ఉంది.

పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌పై రూ. 8 నుంచి 10 రూపాయల వరకు తగ్గించేవిధంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో ధరల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు లాభాల బాటలోనే ఉన్నాయి. లీటర్‌పై రూ. 10 వరకు లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాభాలను ప్రజలకు పంచాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చముర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సమాచారం.

చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం 2022 మే 22న పెట్రోల్, డీజిల్ ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసింది. పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున పన్ను తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను తగ్గించనుంది.

Show comments