Vinay Kola
SBI: SBI కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది.
SBI: SBI కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది.
Vinay Kola
ఈ రోజుల్లో బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారు చాలా ఎక్కువ అయిపోతున్నారు. EMI ఈజీగా కట్టుకోవచ్చులే అని లోన్లు తీసుకుంటున్నారు. ఆ తరువాత కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నవారు కూడా ఉన్నారు. అయితే లోన్ వడ్డీ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కోలాగా ఉంటాయి. దాదాపు ప్రతి నెలా వడ్డీ రేట్లను బ్యాంకులు మారుస్తూ ఉంటాయి. వాటిని పెంచొచ్చు. తగ్గించొచ్చు. లేదా స్థిరంగా ఉంచొచ్చు.ఇక దేశంలో బిగ్గెస్ట్ గవర్నమెంట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షాకింగ్ ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మార్చింది. ఇప్పుడు కొత్త వడ్డీ రేట్లు తీసుకొచ్చింది. ఈ విషయంలో SBI కఠిన నిర్ణయం తీసుకుంది. లోన్లపై కొన్ని సెలెక్టెడ్ టెన్యూర్లపై లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది.ఎస్బీఐ 3 నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్ లోన్లపై ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచేసింది. 5 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచింది. ఈ తాజా వడ్డీ రేట్లు 2024, నవంబర్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి.
ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేట్లు 8.20 శాతం నుంచి గరిష్టంగా 9.10 శాతం దాకా ఉన్నాయి.ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతం వద్దే ఫిక్స్ డ్ గా ఉంది. అలాగే ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.20 శాతంగానే ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ గతంలో 8.50 శాతం ఉంది. ఇప్పుడు అది 8.55 శాతానికి పెరిగింది. ఇక 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరిగింది.ఇక ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ కూడా 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో 8.95 శాతం నుంచి ఇప్పుడు 9 శాతానికి పెరిగింది. రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ అయితే 9.05 శాతం, 9.10 శాతంగా ఉన్నాయి.
ఇక్కడ ఎంసీఎల్ఆర్ అంటే రుణ ఆధారిత వడ్డీ రేటు. అన్ని బ్యాంకులకు ఒకేలా ఉండాలన్న ఉద్దేశంతోనే.. ఆర్బీఐ ఈ మెథడ్ ని తీసుకొచ్చింది. దీన్ని బట్టి ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి ఏ బ్యాంకు కూడా లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. వీటిని బ్యాంకులు దాదాపు ప్రతి నెలా మారుస్తూ ఉంటాయి. ఒకవేళ ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్లపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈ విధంగా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ పెరుగుతుంది.ఎస్బీఐ ఆటో లోన్లు ఏడాది ఎంసీఎల్ఆర్‌తో లింకయ్యి ఉంటాయి. పర్సనల్ లోన్లు అయితే ఎక్కువగా రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయ్యి ఉంటాయి. ప్రస్తుతం ఎస్బీఐ బేస్ రేట్ 10.40 శాతం ఉంది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్(BPLR) 15.15 శాతం ఉంది. ఇదీ సంగతి. ఇక SBI తీసుకొచ్చిన ఈ తాజా వడ్డీ రేట్ల గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.