వారికి SBI గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ లో పెట్టుబడిపెడితే అదిరిపోయే లాభాలు

వారికి SBI గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ లో పెట్టుబడిపెడితే అదిరిపోయే లాభాలు

ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి గుడ్ న్యూస్ అందించింది. ఆ స్కీమ్ లో పెట్టుబడి పెడితే అదిరిపోయే లాభాలను అందుకోవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే?

ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి గుడ్ న్యూస్ అందించింది. ఆ స్కీమ్ లో పెట్టుబడి పెడితే అదిరిపోయే లాభాలను అందుకోవచ్చు. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే?

ప్రభుత్వ రంగానికి చెందిన దేశీయ దిగ్గజ బ్యాంక్ వారిక గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐ తమ ఖాతాదారుల కోసం పలు పథకాలను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా అధిక రాబడులను అందిస్తున్నది. చాలా మంది తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుంటారు. అయితే ఎఫ్డీలపై మిగతా బ్యాంకులకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు ‘సర్వోత్తమ్‌’ అనే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అందిస్తోంది. ఈ స్కీమ్‌పై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. మంచి రాబడి కావాలనుకునే వారు ఇందులో ఎప్డీ చేస్తే అధికాదాయం పొందొచ్చు.

డబ్బు అవసరమనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే సంపాదించే సమయంలో ఏవిధమైన ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం చేస్తుంటారు కాబట్టి శాలరీ వస్తుంది. మీ అవసరాలను తీర్చుకోవచ్చు. కానీ ఉద్యోగం పదవీవిరమణ చేసిన తర్వాత ఆదాయం తగ్గుతూ ఉంటుంది. పెన్షన్ రూపంలో వచ్చే ఆదాయం సరిపోదు. ఇలాంటి సమయంలో ఎస్బీఐ అందించే సర్వోత్తమ్‌ స్కీమ్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్బీ పొందొచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు ఇందులో ఎఫ్డీ చేసుకోవచ్చు. సర్వోత్తమ్‌ స్కీమ్ రెండు విధాలుగా అమలవుతోంది. ఈ స్కీమ్‌లో చేరే సీనియర్ సిటిజన్లు ఏడాది లేదా రెండేళ్ల పెట్టుబడి కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్లకు 7.90 వార్షిక చక్రవడ్డీ రేటు అమలవుతుంది. ఎస్బీఐ సర్వోత్తమ్‌ స్కీమ్‌లో చేరే వారు రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే రెండేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే అధిక రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ టర్మ్‌కి వడ్డీ రేటు 8.14 శాతంగా ఉంది. ఏడాది ఎఫ్‌డీపై 7.82 శాతం వడ్డీ అందుతోంది. ఇదొక లాక్-ఇన్ పీరియడ్ కలిగిన ఎఫ్‌డీ స్కీమ్. అంటే, మెచ్యురిటీ పూర్తయ్యే వరకు పెట్టుబడిని విత్‌డ్రా చేసుకోలేం. మరోవైపు, ఎస్బీఐ రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు రూ.7.77 వడ్డీ అందిస్తోంది.

Show comments