iDreamPost
android-app
ios-app

ఓలా బంపరాఫర్.. టెస్ట్ డ్రైవ్ చేస్తే ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫ్రీగా పొందే ఛాన్స్!

  • Published Oct 26, 2023 | 6:30 PM Updated Updated Oct 26, 2023 | 6:30 PM

ప్రముఖ ఎలక్ట్రిక్​ స్కూటర్ తయారీల కంపెనీ ఓలా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. సరికొత్త ఓలా ఎస్​1 ఎక్స్​+ మోడల్​ను మీరు ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఓలా స్కూటర్ ను ఫ్రీగా ఇస్తుందంటే నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజమేనండి బాబూ.

ప్రముఖ ఎలక్ట్రిక్​ స్కూటర్ తయారీల కంపెనీ ఓలా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. సరికొత్త ఓలా ఎస్​1 ఎక్స్​+ మోడల్​ను మీరు ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఓలా స్కూటర్ ను ఫ్రీగా ఇస్తుందంటే నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజమేనండి బాబూ.

  • Published Oct 26, 2023 | 6:30 PMUpdated Oct 26, 2023 | 6:30 PM
ఓలా బంపరాఫర్.. టెస్ట్ డ్రైవ్ చేస్తే ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఫ్రీగా పొందే ఛాన్స్!

ప్రముఖ ఎలక్ట్రిక్​ స్కూటర్ తయారీల కంపెనీ ఓలా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. సరికొత్త ఓలా ఎస్​1 ఎక్స్​+ మోడల్ ​ను మీరు ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఓలా స్కూటర్ ను ఫ్రీగా ఇస్తుందంటే నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజమే. ఇలా చేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓలా ఈవీ బైక్ లను కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సేల్స్ మరింత పెంచుకోవడంలో భాగంగా వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తోంది ఓలా. ముఖ్యంగా పండుగల సీజన్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు తమ వాహనాలపై ఆఫర్స్​, డిస్కౌంట్స్​ ఇస్తుంటాయి.

దీనిలో భాగంగా ఓలా.. ‘భారత్​ ఈవీ ఫెస్ట్’​ ద్వారా పలు క్రేజీ ఆఫర్స్​ అందిస్తోంది. ఎక్స్​టెండెడ్​ వారెంటీలపై 50 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్​. మీరు ఎవరినైనా రిఫర్​ చేస్తే దాని మీద మీకు రూ. 2 వేల వరకు రిఫరల్​ ఆమౌంట్​ వస్తుంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్స్​, డిస్కౌంట్స్​, వారెంటీలపై బెనిఫిట్స్​ వంటివి కూడా సంస్థ ఇస్తోంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద మీరు రూ.10వేల వరకు ఆదా చేసుకోవచ్చు. పలు ఎంపిక చేసిన క్రెడిట్​ కార్డులపై రూ. 7,500 వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్​ని కూడా ఇస్తున్నట్టు ఓలా స్పష్టం చేసింది. ఈ భారత్​ ఈవీ ఫెస్ట్ ​లో బ్యాటరీలపై 5 ఏళ్ల వరకు వారంటీ ఇస్తోంది ఓలా ఎలక్ట్రిక్​. ఆల్​ న్యూ ఎస్​1 ప్రోపై 5 ఏళ్ల ఎక్స్​టెండెడ్​ వారెంటీని కూడా అందిస్తోంది.

ఇక ఎస్​1 ఎయిర్​పై 5ఏళ్ల ఎక్స్​టెండెడ్​ వారెంటీ మీద 50 శాతం డిస్కౌంట్​ని కూడా ఇస్తోంది. బ్యాటరీలపై ఉండే వారెంటీని కూడా 50 శాతం డిస్కౌంట్ ​లో అందిస్తోంది. పండుగ సీజన్‌లో, కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కొనుగోలు చేసే వినియోగదారులకు జీరో డౌన్ పేమెంట్, జీరో కాస్ట్ EMI మరియు జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అంతేకాకుండా.. ఓలా ఎస్​1 ప్రో సెకండ్​ జనరేషన్​ ఈ-స్కూటర్ ​ను టెస్ట్​ డ్రైవ్​ చేసే వారికి సరికొత్త ఓలా ఎస్​1 ఎక్స్​+ ఎలక్ట్రిక్​ వెహికిల్ ​ను దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతి రోజు ఒకరిని ఎంపిక చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఉచితంగా అందించనుంది. మరి మీరు ఉచితంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందాలంటే టెస్ట్ డ్రైవ్ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş