తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ కావాలా? అయితే Realme Narzo N61 కొనాల్సిందే!

Realme Narzo N61: రియల్ మి నుంచి వచ్చిన నార్జో సిరీస్ పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్లలో ఉంటాయి.

Realme Narzo N61: రియల్ మి నుంచి వచ్చిన నార్జో సిరీస్ పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్లలో ఉంటాయి.

 

రియల్‌మి ఫోన్లు బడ్జెట్ ఫోన్లు కొనేవారికి బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా రియల్ మి నుంచి వచ్చిన నార్జో సిరీస్ బాగా పాపులర్ అయ్యింది. ఎందుకంటే ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరలోనే అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు ఈ ఫోన్లలో ఉంటాయి. అందుకే వీటికి మార్కెట్లో మాములుగా డిమాండ్ ఉండదు. ప్రస్తుతం ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది. ఈ సెల్ లో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. దీంట్లో కేవలం రూ. 7000 కంటే తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. Realme Narzo N61 ఈ సేల్‌లో అత్యంత తక్కువ ధరకే అమ్ముడవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఫోన్లో 90Hz రిఫ్రెష్ రేట్, ప్రీమియం ఫినిషింగ్ డిజైన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. అయితే సాధారణంగా ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్లో ఇలాంటి సూపర్ ఫీచర్లు కనిపించవు. అయితే ఈ ఫోన్‌లో మాత్రం హై ఎండ్ ఫీచర్లని పొందవచ్చు. అది కూడా అతి తక్కువ ధరకే. ఈ ఫోన్ డిస్‌ప్లే ఒక సూపర్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఇక కెమెరా అయితే సూపర్. దీనికి ఏకంగా 32MP కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్లో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్‌ పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. దీని కెపాసిటీ ఏకంగా 5000mAh ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ని కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 8999 ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రముఖ ఈకామర్స్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ ని తక్కువ ధరకే పొందవచ్చు. దీన్ని అన్నీ ఆఫర్లతో కలిపి కేవలం రూ. 6,498కే సొంతం చేసుకోవచ్చు.

ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ వాయేజ్ బ్లూ, మార్బుల్ బ్లాక్ కలర్లలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌, 6జీబీ RAM వేరియంట్ కూడా ఉంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ 6.74 అంగుళాలు ఉంటుంది. ఈ స్క్రీన్ IPS LCD డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ద్వారా పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ IP54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ని కలిగి ఉంది. ఇలా మీరు కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లోపు మంచి ప్రీమియం ఫీచర్లు ఉండే ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఈ ఫోన్ ని కొనుగోలు చేయండి. మరి ప్రముఖ ఈకామర్స్ సంస్థ సేల్ నుండి అతి తక్కువ ధరకే లభిస్తున్న ఈ Realme Narzo N61పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.

Show comments