RBI నుంచి శుభవార్త! ఇక గోల్డ్ లోన్ ని EMIలో తీర్చుకోవచ్చు!

Gold Loan: గోల్డ్ లోన్ ని తీర్చడానికి చాలా మందికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఆర్బిఐ గుడ్ న్యూస్ చెప్పింది.

Gold Loan: గోల్డ్ లోన్ ని తీర్చడానికి చాలా మందికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి ఆర్బిఐ గుడ్ న్యూస్ చెప్పింది.

బంగారం కేవలం అలంకరణకి మాత్రమే కాకుండా కష్ట సమయాల్లో మన ఆర్థిక అవసరానికి కూడా ఉపయోగపడుతుంది. మనకు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సి వస్తుంది. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర ఎక్కడా దొరక్కుంటే.. బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తామ్. ఇక హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, వెహికిల్ లోన్స్ కంటే గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి. అందువల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా బంగారం తాకట్టు పెట్టి ఈజీగా లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. పైగా ఇతర అన్ని లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్లు అనేవి చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అయితే ఈ లోన్లు సేఫ్ అయినా కొన్ని సార్లు లోన్ కట్టాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీటిని వాయిదాల్లో చెల్లించే ఫెసిలిటీ లేదు. అయితే తాజాగా గోల్డ్ పై లోన్ తీసుకునే వారికి RBI గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోని గోల్డ్ లోన్ లని ఈఎంఐ ప్రాసెస్ లో తీర్చేసే ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావాలని RBI ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే గోల్డ్ లోన్లని శాంక్షన్ చేసే సమయంలో ఇంకా వాటిని తిరిగి కట్టే టైమ్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి RBI దృష్టికి వచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం గోల్డ్ తీసుకొని లోన్లు ఇచ్చే సంస్థలు కానీ బ్యాంకులు కానీ కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత మనం మొత్తం లోన్ ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. లేదా టెన్యూర్ కి ముందుగానే మన వద్ద డబ్బులు ఉంటే.. అప్పటికి అసలు, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించి గోల్డ్ విడిపించుకునే వీలు మాత్రమే ఉంటుంది.

అయితే బంగారం విలువను లెక్క కట్టే విషయంలో లోపాలు, వేలం సరిగ్గా లేకపోవడం వంటి తప్పులను RBI గుర్తించింది. అంతే కాకుండా వడ్డీ కింద కొంత డబ్బు చెల్లించి గోల్డ్ లోన్ లను ఇంకా ఎక్కువ కాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది ఫాలో అవుతున్నట్లు ఆర్బీఐ గమనించింది. అందుకే ఇలా EMI ద్వారా గోల్డ్ లోన్ లను తీర్చుకునే సౌకర్యాన్ని ప్రజలకు అందించాలని RBI డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. త్వరలో ఈ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ విధానం అమలులోకి వస్తే.. ఇకపై గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి గోల్డ్ లోన్ లను EMI ద్వారా తీర్చుకునే సదుపాయం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments