iDreamPost
android-app
ios-app

డిగ్రీ పూర్తి చేస్తే చాలు RBIలో ఉద్యోగాలు… ఎలా సెలక్ట్‌ చేస్తారంటే..

  • Published Sep 19, 2023 | 1:26 PM Updated Updated Sep 19, 2023 | 1:26 PM
  • Published Sep 19, 2023 | 1:26 PMUpdated Sep 19, 2023 | 1:26 PM
డిగ్రీ పూర్తి చేస్తే చాలు RBIలో ఉద్యోగాలు… ఎలా సెలక్ట్‌ చేస్తారంటే..

డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్‌బీఐలోని పలు పోస్టుల భర్తీకి నోటిషికేషన్‌ విడుదల చేసింది. దీని కింద దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నుట్లు ప్రకటించింది. మరి ఇంతకు ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఎవరు అర్హులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు..

తాజా నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా మొత్తం 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాక.. అప్లై చేసుకునే అభ్యర్థులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్థానిక రాష్ట్ర భాషలో కచ్చితంగా ప్రావిణ్యం ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లికేషన్‌ ప్రక్రియ అక్టోబర్‌ 4వ తేదీతో ముగియనుంది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌తో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కేవలం రూ. 50 ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆ అప్లికేషన్‌ ఫామ్‌ను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబయి చిరునామాకు పంపాలి. అక్టోబర్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిస్తే.. ఆ తర్వాత 17 రోజులకు అనగా అక్టోబర్‌ 2023 వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 2న మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను దర్శించండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet