Krishna Kowshik
Jimmy Naval Tata: బిజినెస్ టైకూన్ రతన్ టాటా ఇక లేరు. మిలియన్ కోట్లకు ఆస్తి పరుడైనా.. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అయితే ఆయన కన్నా మరింత సింప్లిసిటీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆయన బ్రదర్. ఇంతకు ఆయన ఎవరంటే..
Jimmy Naval Tata: బిజినెస్ టైకూన్ రతన్ టాటా ఇక లేరు. మిలియన్ కోట్లకు ఆస్తి పరుడైనా.. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అయితే ఆయన కన్నా మరింత సింప్లిసిటీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆయన బ్రదర్. ఇంతకు ఆయన ఎవరంటే..
Krishna Kowshik
అలుపెరగని వ్యాపార వేత్త, మానవతావాది, దాతృత్వ శీలి రతన్ టాటా కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో యావత్ భారతావని శోక సంద్రంలో మునిగిపోయింది. తమ ఇంట్లో మనిషి చనిపోయినట్లుగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. వ్యాపారం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు.. కస్టమర్ల నమ్మకాన్ని కూడా కూడగట్టమన్న సందేశాన్ని ఆయన బలంగా నమ్మారు. కాబట్టే.. టాటా గ్రూప్ నుండి వచ్చిన ప్రతి ఉత్పత్తి సక్సెస్ అయ్యింది. వంద రూపాయలు దానం చేస్తే పది సార్లు చెప్పుకునే ఈ సమాజంలో కోట్లాది కోట్లు రూపాయలు ధార్మిక సేవలకు వినియోగిస్తూ పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఇతడే కాదు.. ఆయన సోదరుడు కూడా ఇదే విధానాలను అనుసరిస్తున్నారు. వినడానికి వింతగా అనిపిస్తుంది కదా.. నిజమేనండీ బాబు.
ఇండస్ట్రీయల్ టైటాన్ రతన్ టాటా గురించి, ఆయన గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా సంస్థకు ఎన్నో సేవలు అందించారు. టాటా గ్రూప్ అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి తీసుకు రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అయితే రతన్ టాటా గురించి తెలుసు కానీ.. ఆయనకు ఓ సోదరుడు ఉన్నాడన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని కాదని అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సింప్లిసిటీకి పెద్ద పీట వేస్తూ జీవనం సాగిస్తున్నారు రతన్ టాటా సోదరుడు రతన్ టాటా. వారసత్వంగా వచ్చిన బిజినెస్, కోట్ల ఆస్తిని కాదని కేవలం 2bhk ఇంట్లో ఉంటున్నారు. ముంబయిలోని కొలబాలోని హాంస్టన్ కోర్టు ఆరవ అంతస్తులో సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు.
జిమ్మీ కేవలం లగ్జరీ లైఫ్‌కు దూరంగా ఉండటమే కాదు.. మొబైల్ కూడా వాడరట. ఆధునిక సాంకేతి పరిజ్ఞానానికి ఆమడ దూరం ఉంటారట. కేవలం పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదువుతూ కాలక్షేపం చేస్తారని తెలుస్తుంది. ఆయన చాలా అరుదుగా బయటకు వస్తారట. 1989లో తండ్రి నావల్ టాటా మరణించిన తర్వాత, జిమ్మీ టాటా వాటాను వారసత్వంగా పొందారు. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా సన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్, టాటా కెమికల్స్‌లో జిమ్మీకి వాటాలు ఉన్నాయి. అతను రతన్ టాటా ట్రస్ట్‌కు ట్రస్టీ కూడా. కానీ కుటుంబ వ్యాపారంపై ఆసక్తి లేకపోవడంతో సింఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
ఒకవైపు రతన్ టాటా తన జీవితాన్ని వ్యాపారాలు, దాతృత్వాలతోనే గడపగా.. అదే విలువలను పాటిస్తున్నారు జిమ్మీ కూడా. అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అన్న మరణానంతరం ఆయనకు నివాళులు సమర్పించాడు సోదరుడు జిమ్మీ టాటా. గతంలో సోదరుడితో దిగిన ఫోటోను పంచుకున్నారు రతన్ టాటా. చూసేందుకు ఇద్దరు ఒకేలా ఉంటారు. అందుకేనేమో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న నైజాన్ని పుణికి పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అన్నాదమ్ములిద్దరూ ఒకే రకమైన విధానాలు పాటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.