Vinay Kola
PAN Card: పాన్ కార్డు చాల ముఖ్యమైన డాక్యుమెంట్. ఎన్నో ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డు కచ్చితంగా అవసరం.
PAN Card: పాన్ కార్డు చాల ముఖ్యమైన డాక్యుమెంట్. ఎన్నో ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డు కచ్చితంగా అవసరం.
Vinay Kola
పాన్ కార్డు అనేది చాల ముఖ్యమైన డాక్యుమెంట్. దీన్ని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. బ్యాంక్ ఎకౌంటుని ఓపెన్ చెయ్యడానికి ఇంకా ఎన్నో ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డు కచ్చితంగా అవసరం. ఇక పాన్ కార్డ్‌లో వ్యక్తి పేరు, అతని ఫోటో, పుట్టిన తేదీ, శాశ్వత ఖాతా నంబర్ ఉంటాయి. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, రుణాలు, పెట్టుబడులు ఉన్నాయి వంటి వివరాలను పాన్ నంబర్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. కాబట్టి ఇలాంటి ఆర్ధికపరమైన పనులకు కచ్చితంగా పాన్ అవసరం. అయితే మనలో చాలా మందికి కూడా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటాయి. అలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండొచ్చా? ఒకవేళ కలిగి ఉంటే కలిగే సమస్యలు ఏంటి? పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను అస్సలు కలిగి ఉండకూడదు. అలా రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ నంబర్లు కలిగి ఉండటం ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఇదొక నేరం. ఈ విధమైన చట్టవిరుద్ధపు పని చేసినట్లైతే ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 272 బి కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఇక ఈ చట్టం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తి రూ.10,000 జరిమానాని చెల్లించవలసి ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే, మీ వద్ద ఒకదానిని మాత్రమే ఉంచుకుని, మరొకటి కచ్చితంగా సరెండర్ చెయ్యాలి. లేకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
అందుకే పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్‌తో లింక్ చేయని పాన్ నంబర్ ఏమాత్రం చెల్లుబాటు కాదు. పైగా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కూడా. దేశంలో రెండు పాన్ నంబర్లు ఉన్న చాలా కేసులు కూడా ఉన్నాయి. అందుకే ఆదాయపు పన్ను శాఖ ఆధార్, పాన్ నంబర్లను లింక్ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఎవరైనా కానీ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆధార్ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. పాన్ కార్డుని తయారు చేయడానికి ఆధార్ లింక్ అనేది తప్పనిసరి. 2017 ముందు వరకు ఈ ప్రాసెస్ లేదు. కాని ఇప్పుడు ఉంది. అది కూడా ఇప్పుడు ఆధార్, పాన్ ఉచితంగా లింక్ చేయలేరు. లింక్ చేయడానికి రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి పాన్ విషయంలో ప్రభుత్వం విధిస్తున్న ఈ జరిమానాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.