iDreamPost
android-app
ios-app

నీతా అంబానీ గొప్ప మనసు.. బర్త్‌డే సందర్భంగా పేద పిల్లలకు భోజనం పెట్టారు!

  • Published Nov 02, 2023 | 4:52 PM Updated Updated Nov 02, 2023 | 4:52 PM

నవంబర్ 1న రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.

నవంబర్ 1న రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.

  • Published Nov 02, 2023 | 4:52 PMUpdated Nov 02, 2023 | 4:52 PM
నీతా అంబానీ గొప్ప మనసు.. బర్త్‌డే సందర్భంగా పేద పిల్లలకు భోజనం పెట్టారు!

నవంబర్ 1న రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఆమె పుట్టినరోజు వేడుక చాలా ప్రత్యేకంగా జరిగింది. పేదల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుని గొప్ప మనసు చాటుకున్నారు. నీతా అంబానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని 15 రాష్ట్రాల్లో 1.40 లక్షల మందికి అన్న సేవను నిర్వహించారు. తన బర్త్ డే సందర్భంగా లక్షలాది మందికి ఆహారం, రేషన్ ఇస్తూ.. నిరుపేద పిల్లల కడుపునింపారు.

నీతా అంబానీ బుధవారం తన 60 పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని అన్న సేవలో 3 వేల మంది నిరుపేద పిల్లలకు భోజనం పెట్టారు. వారితో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు మరియు అనారోగ్యంతో ఉన్న వారితో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా, నీతా అంబానీ చాలా కాలంగా పిల్లల విద్య, మహిళలను స్వావలంబన చేయడం, వృద్ధులకు సేవ చేయడం, కళ మరియు క్రీడల రంగంలో నిరంతరం కృషి చేస్తున్నారు.

కాగా మహిళా వ్యాపారవేత్తగా ఉంటూనే ఎన్నో సామాజికి కార్యక్రమాలు చేపట్టారు నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించడం, పేదవారిని ఆదుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. రిలయన్స్‌ ఫౌండేషన్ ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 7 నుండి 10 కోట్ల మంది దీని ద్వారా సహాయం పొందారు. ఈ క్రమంలో నిరుపేదలతో నీతా అంబానీ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. నీతా అంబానీ తన పుట్టిన రోజు సందర్బంగా పేదల పట్ల చాటుకున్న మంచి మనసుకు అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş