New Maruti Dzire: తక్కువ ధరలో అప్డేటెడ్ ఫీచర్లతో వచ్చేస్తోన్న డిజైర్!

New Maruti Dzire: మారుతి సుజుకి అప్‌డేట్ చేయబడిన డిజైర్‌ను విడుదల చేయడానికి పనులు మొదలు పెట్టింది. అతి త్వరలో రాబోయే కొత్త డిజైర్‌ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

New Maruti Dzire: మారుతి సుజుకి అప్‌డేట్ చేయబడిన డిజైర్‌ను విడుదల చేయడానికి పనులు మొదలు పెట్టింది. అతి త్వరలో రాబోయే కొత్త డిజైర్‌ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

మారుతి సుజుకి రీసెంట్ గా తన కొత్త జనరేషన్ స్విఫ్ట్‌ను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన డిజైర్‌ను విడుదల చేయడానికి పనులు మొదలు పెట్టింది. అతి త్వరలో రాబోయే మారుతి డిజైర్‌ను ఇటీవలే టెస్ట్ చేశారు. కొత్త డిజైర్‌ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ కారు మారుతి సుజుకి కొత్త హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. ఇందులో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ 82 PS హార్స్ పవర్ ఇంకా 108 Nm టార్క్ ని జనరేట్ చేయగలదు. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌ ఉంటాయి.

ఈ సరికొత్త మారుతి సుజుకి డిజైర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 5 మంది సౌకర్యంగా కూర్చొని లాంగ్ జర్నీల్లో ప్రయాణించవచ్చు. ఈ కార్ పెద్ద గ్రిల్, ఫుల్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED ఫాగ్ లైట్లు, ముందు, వెనుక బంపర్‌లతో కూడిన ఆకట్టుకునే అల్లాయ్ వీల్స్, ట్రై-యారో LED టైల్‌లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి సూపర్ ఫీచర్లని కలిగి ఉంది. ఇంకా అలాగే ఈ న్యూ మారుతి డిజైర్ లోపలి భాగంలో 9 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ ఇంకా అలాగే 4.2-అంగుళాల డిజిటల్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు వస్తాయని సమాచారం తెలుస్తుంది.

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ అసిస్ట్, వెనుక AC వెంట్ వంటి ఫీచర్లు రానున్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ సెడాన్ ని ప్రజలకు అందుబాటు ధరలోనే విడుదల చేయాలని మారుతీ కంపెనీ భావిస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం దీని ధర రూ. 6.50 లక్షల నుండి రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉంటుందట. కంపెనీ ఈ కారుని దీపావళి తర్వాత విడుదల చేయవచ్చని సమాచారం తెలుస్తుంది. చూడాలి ఈ కార్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో.. ఇక త్వరలో విడుదల కానున్న న్యూ మారుతీ సుజుకి డిజైర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments