HYDలోని ఆ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM ప్రారంభం.. ఎన్ని గ్రాముల వరకు కొనవచ్చంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఆ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. ఎన్ని గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఆ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. ఎన్ని గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చంటే?

ఒకప్పుడు ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లేవారు. డబ్బు, బంగారాన్ని దాచుకోవాలంటే బ్యాంకులను సంప్రదించేవారు. ఖాతాదారులు తమ నగదును తీసుకోవాలన్నా, దాచుకోవాలన్నా బ్యాంకులకు పరుగు తీయాల్సిందే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాక కొన్ని సేవలకు మినహా తక్కిన లావాదేవీలన్నీ ఏటీఎంల ద్వారానే పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బులు మాత్రమే కాదు బంగారం కూడా తీసుకోవచ్చు. అయితే అది అన్నీ ఏటీఎంలల్లో సాధ్యపడదు. గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన గోల్డ్ ఏటీఎంలలో మాత్రమే బంగారం కాయిన్స్ ను తీసుకునే వీలుంది. ఇప్పుడు ఈ గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ నగరంలోని ఓ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న వేళ అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. ఇక పసిడి ప్రియులు జ్యూవెల్లరీ షాప్ కు వెళ్లకుండానే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఏటీఎంను ఉపయోగించుకుని ఎంచక్కా గోల్డ్ కాయిన్స్ ను పొందొచ్చు. అయితే ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు పసిడి కొనుగోలు చేయొచ్చు.

గోల్డ్‌ ఏటీఎం ఉపయోగించి డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లేదా యూపీఐ పేమెంట్‌ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. ఏటీఎంలో నగదు విత్ డ్రా ఎలా చేస్తామో అదే విధంగా గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న గోల్డ్ కాయిన్లు బయటికి వస్తాయి. గోల్డ్ ఏటీఎం ద్వారా బంగారం కొనాలనుకునే వారు 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారం లేదా వెండి కాయిన్లను ఎంపిక చేసుకుని నిర్దేశించిన మొత్తాన్ని డెబిట్‌, క్రెడిట్‌ లేదా యూపీఐ పేమెంట్స్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments