HYDలో ఈ ఏరియాలో తగ్గిన స్థలాల రేట్లు.. ఇప్పుడు కొంటే లక్షల్లో లాభం!

Land Rates In Patancheruvu: హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికైనా లేదా సొంతిల్లు కట్టుకుని నివాసం ఉండడానికైనా ఈ ఏరియాలో స్థలం మీద పెట్టుబడి పెట్టడం మంచి ఛాయిస్ అనే చెప్పాలి. సిటీలోని ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు తగ్గాయి.    

Land Rates In Patancheruvu: హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికైనా లేదా సొంతిల్లు కట్టుకుని నివాసం ఉండడానికైనా ఈ ఏరియాలో స్థలం మీద పెట్టుబడి పెట్టడం మంచి ఛాయిస్ అనే చెప్పాలి. సిటీలోని ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు తగ్గాయి.    

హైదరాబాద్ లో స్థలం మీద పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? లేదా మీరు సొంతిల్లు కట్టుకుని ఉండడం కోసం కొనాలని భావిస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ఇప్పుడు హైదరాబాద్ లో పలు ఏరియాల్లో ఇళ్ల స్థలాల ధరలు తగ్గాయి. అయితే ఇవేమీ సామాన్యులకు అందుబాటు ధరల్లో లేవు. బడ్జెట్ లో స్థలం కొనాలనుకుంటే కనుక ఈ గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలకు దగ్గరలో ఉన్న ఈ ఏరియాకి వెళ్లిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఏరియాలో స్థలాల రేట్లు తగ్గాయి. ఇప్పుడు కనుక ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే రెండు లక్షలు పైనే లాభం పొందే ఛాన్స్ ఉంది. అంతకంటే ఎక్కువ పెరిగితే ఎక్కువ లాభం పొందవచ్చు. 

హైదరాబాద్ ప్రధాన సిటీకి, ఇండస్ట్రియల్ రూట్ కి పటాన్చెరువు మధ్యలో ఉంది. దీని కారణంగా బెస్ట్ లొకేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అవుటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవే 65కి మంచి కనెక్టివిటీ కలిగి ఉంది. దీని కారణంగా సిటీలోని వివిధ ప్రాంతాలకు సులువుగా ప్రయాణం చేయవచ్చు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు పటాన్చెరువు దగ్గరగా ఉండడంతో ఐటీ ఉద్యోగులకు ఈ ఏరియా ఈజీ ఛాయిస్ గా ఉంది. అలానే ప్రజా రవాణా కూడా మెరుగ్గా ఉంది. తరచుగా ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. ఇక మెట్రో కూడా విస్తరించనుంది. పటాన్చెరువులో స్థలాల మీద పెట్టుబడి పెట్టడానికి గానీ ప్రాపర్టీ కొనడానికి గానీ ప్రధాన కారణం.. అక్కడ సరసమైన ధరల్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకు ప్రాపర్టీలు దొరుకుతున్నాయి.

హైదరాబాద్ లోని మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువే. కొత్తగా స్థలాల మీద పెట్టుబడి పెట్టాలి లేదా రెసిడెన్షియల్ పర్పస్ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునేవారికి పటాన్చెరువు ఉత్తమమైన ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పటాన్చెరువులో యావరేజ్ గా చదరపు అడుగు స్థలం రూ. 3 వేలుగా ఉంది. గత ఏడాది ప్రారంభంలో కూడా ఇదే ధర ఉండేది. ఈ ఏడాది ప్రారంభానికి వచ్చేసరికి చదరపు అడుగు మీద రూ. 3,200 పెరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం చదరపు అడుగు మీద రూ. 200 తగ్గింది. దీంతో యావరేజ్ గా చదరపు అడుగు స్థలం విలువ రూ. 3000గా ఉంది. అంటే గజానికి రూ. 27 వేలు పడుతుంది. ఒక 150 గజాలు కొనాలనుకుంటే కనుక రూ. 40 లక్షలు అవుతుంది. ఇప్పుడు చదరపు అడుగు మీద రూ. 3 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రానున్న రోజుల్లో చదరపు అడుగు రూ. 5 వేలు అయితే కనుక భారీ లాభాలను పొందవచ్చు. కాబట్టి పటాన్చెరువు ఏరియాలో ల్యాండ్ రేట్లు యగ్గయి కాబట్టి ఇదే మంచి అవకాశం అని చెబుతున్నారు.        

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

Show comments