నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్, డిగ్రీ అర్హతతో లక్ష ఉద్యోగాలు!

ఇంటర్, డిగ్రీ పూర్తై ఉద్యోగాలకోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్తను అందించింది ప్రముఖ కంపెనీ. ఏకంగా లక్ష ఉద్యోగాలను ప్రకటించింది. అర్హత ఆసక్తి ఉన్న వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని కోరింది. త్వరలో రానున్న పండగల నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీ తన సేల్స్ కు సన్నద్ధమవుతోంది. దీనిలో బాగంగానే లక్ష ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా పండుగల సీజన్ లో కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సేల్స్ విభాగంలో అవసరమైన ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రక్రియను మొదలు పెట్టింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్.

పండుగల సీజన్ లో ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల కొనుగోలు చేసే వారి సంఖ్య మిగతా రోజుల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీనికి గల కారణం ఈ కామర్స్ సంస్థలు అందించే ఆఫర్స్. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఆకర్షించే ఆఫర్లతో భారీ సేల్ కు సిద్దమవుతోంది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్. కాగా డిమాండ్ కు తగిన విధంగా రిక్రూట్ మెంట్ చేసుకుంటోంది ఫ్లిప్ కార్ట్. ఇంటర్, డిగ్రీ అర్హతతో లక్ష ఉద్యోగులను నియమించుకోనుంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

అయితే కొత్తగా నియమించుకునే ఉద్యోగులను ఫ్లిప్ కార్ట్ కి చెందిన ఫుల్ ఫిల్మెంట్ సెంటర్స్, సార్టింగ్ సెంటర్స్, డెలివరీ హబ్ లతో పాటు సప్లై చైన్ అంతటా నియమించనున్నారు. అయితే ఈ ఉద్యోగాలు కేవలం తాత్కాలికం అని, పండుగ సీజన్ లో వచ్చే డిమాండ్ ను తీర్చడానికి మాత్రమే వీరిని నియమించుకున్నట్లు కంపెనీ తెలిపింది. పూర్తి వివరాలకు ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది.

Show comments