1 Year Free Internet: రూ.50తో జియో ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకుంటే ఏడాది పాటు ఫ్రీ డేటా పొందే ఛాన్స్!

Jio Airfiber: రూ.50తో జియో ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకుంటే ఏడాది పాటు ఫ్రీ డేటా పొందే ఛాన్స్!

Get A Chance To Win Unlimited Internet For 1 Year With Rs.50: ఉచితంగా ఇంటర్నెట్ కావాలా? ఐతే మీరు కేవలం 50 రూపాయలతో ఈ పని చేస్తే చాలు. మీరు ఫ్రీగా ఏడాది పాటు 3,599 రూపాయల విలువ చేసి అపరిమిత ఇంటర్నెట్ డేటా పొందే అవకాశం దక్కుతుంది. ఈ 3,599 ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్స్ ని కూడా ఫ్రీగా పొందవచ్చు.

Get A Chance To Win Unlimited Internet For 1 Year With Rs.50: ఉచితంగా ఇంటర్నెట్ కావాలా? ఐతే మీరు కేవలం 50 రూపాయలతో ఈ పని చేస్తే చాలు. మీరు ఫ్రీగా ఏడాది పాటు 3,599 రూపాయల విలువ చేసి అపరిమిత ఇంటర్నెట్ డేటా పొందే అవకాశం దక్కుతుంది. ఈ 3,599 ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్స్ ని కూడా ఫ్రీగా పొందవచ్చు.

ఈరోజుల్లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. వైఫై, పోస్ట్ పెయిడ్, మొబైల్ డేటా ఇలా అనేక విధాలుగా ఇంటర్నెట్ డేటాని వినియోగిస్తున్నారు. ఎయిర్ టెల్, యాక్ట్ ఫైబర్ నెట్ వంటి వైఫై కనెక్షన్స్ తీసుకోవాలంటే నెలకు 600 రూపాయల పైనే ఉంటుంది. అయితే మీరు ఉచితంగా ఏడాది పాటు అపరిమిత డేటా పొందే అవకాశం కల్పిస్తుంది జియో. అవును ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియో కంపెనీ కొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది. జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ని బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది.     

జియో కొత్తగా ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ని తీసుకుంటే 800కి పైగా టీవీ ఛానల్స్, 15కి పైగా ఓటీటీ ప్లాన్స్, సెకనుకు 30 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీ స్పీడ్ తో అన్ లిమిటెడ్ వైఫై డేటా పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ లైట్, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, జీ5, డిస్కవరీ+, హోయ్ చాయ్, సన్ ఎన్ఎక్స్టీ, షీమారో మీ, డాక్యుబె, ఆల్ట్ బాలాజీ, ఈరోస్ నవ్, ఎపిక్ ఆన్, డిస్నీ+హాట్ స్టార్, ఈటీవీ విన్, ఫ్యాన్ కోడ్ ఇలా మొత్తం 17 ఓటీటీ యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ జియో ఎయిర్ ఫైబర్ లో మొత్తం నాలుగు ప్లాన్లు ఉన్నాయి. 599, 888, 899, 1199 రూపాయల ప్లాన్స్ ఉన్నాయి. మూడు, ఆరు, 12 నెలల ప్లాన్స్ కూడా ఉన్నాయి. 

599 రూపాయల ప్లాన్ వివరాలు:

  • ప్లాన్ ధర: నెలకు రూ. 599 
  • 30 ఎంబీపీఎస్ వద్ద అపరిమిత డేటా
  • 800+ టీవీ ఛానల్స్ 
  • 13 ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్స్
  • రూ.10 వేల విలువ చేసే వైఫై 6 రౌటర్
  • 4కే సెట్ టాప్ బాక్స్

888 రూపాయల ప్లాన్ వివరాలు:

  • ప్లాన్ ధర: రూ. 888
  • 30 ఎంబీపీఎస్ వద్ద అపరిమిత డేటా
  • 800+ టీవీ ఛానల్స్ 
  • 13+3 ప్రీమియం ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్స్
  • రూ.10 వేల విలువ చేసే వైఫై 6 రౌటర్
  • 4కే సెట్ టాప్ బాక్స్

899 రూపాయల ప్లాన్ వివరాలు:

  • ప్లాన్ ధర: రూ. 899
  • 100 ఎంబీపీఎస్ వద్ద అపరిమిత డేటా
  • 800+ టీవీ ఛానల్స్ 
  • 13 ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్స్
  • రూ.10 వేల విలువ చేసే వైఫై 6 రౌటర్
  • 4కే సెట్ టాప్ బాక్స్

1,119 రూపాయల ప్లాన్ వివరాలు:

  • ప్లాన్ ధర: రూ. 1,119
  • 100 ఎంబీపీఎస్ వద్ద అపరిమిత డేటా
  • 800+ టీవీ ఛానల్స్ 
  • 13+3 ఓటీటీ యాప్ సబ్ స్క్రిప్షన్స్
  • రూ.10 వేల విలువ చేసే వైఫై 6 రౌటర్
  • 4కే సెట్ టాప్ బాక్స్

మామూలుగా ఇన్స్టాలేషన్ ఛార్జీలు వెయ్యి రూపాయలు ఉంటుంది. అయితే ఫ్రీడమ్ ఆఫర్ లో భాగంగా ఉచితంగా ఇన్స్టాలేషన్ సేవలను పొందవచ్చు. ఇప్పుడు 50 రూపాయల అడ్వాన్స్ పేమెంట్ తో జియో ఎయిర్ ఫైబర్ ని బుక్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేకుండా కనెక్షన్ ని పొందవచ్చు. అంతేకాదు 3,599 రూపాయల విలువ చేసే స్మార్ట్ ఫోన్ ప్లాన్ ని ఏడాది పాటు ఉచితంగా పొందే అవకాశం పొందవచ్చు. ఒకవేళ అదృష్టం లేక మీరు గెలవలేదు అన్నప్పుడు మీరు కట్టిన 50 రూపాయలను ఫైనల్ పేమెంట్ అప్పుడు పూర్తిగా అడ్జస్ట్ చేస్తారు. అంటే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నప్పుడు 3,599 రూపాయల ప్లాన్ ధరలో 50 రూపాయలు తగ్గిస్తారు. అప్పుడు మీరు రూ. 3,549 చెల్లిస్తే సరిపోతుంది.

ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అవసరం లేదనుకుంటే మీ 50 రూపాయలకి డేటా ప్యాక్ ని ఇస్తారు. ఎలా చూసినా గానీ బెనిఫిట్ అయితే ఉంది. ఇన్స్టాలేషన్ ఛార్జీలు లేవు. లక్ ఉంటే ఏడాది పాటు ఫ్రీగా ఫోన్ లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. ఒకవేళ లక్ లేకున్నా గానీ మీరు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ప్లాన్ ని ఎంచుకుంటే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సహా 15కి పైగా ఓటీటీ యాప్స్ కే సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. పైగా 10 వేల రూపాయల విలువ చేసే వైఫై 6 రౌటర్ ని ఫ్రీగా పొందవచ్చు. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితంగా వస్తుంది. 800కి పైగా టీవీ ఛానల్స్ ఫ్రీగా చూడచ్చు. అపరిమిత వైఫై డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ ని లేదా లక్కీ ఛాన్స్ ని పొందాలంటే మై జియో యాప్ లో గానీ లేదా జియో వెబ్ సైట్ లోకి గానీ వెళ్లి ‘జియో ఎయిర్ ఫైబర్’ని బుక్ చేసుకోవాలి.

Show comments