iDreamPost
android-app
ios-app

ఈషా అంబానీ మెడలో అత్యంత ఖరీదైన నెక్లస్‌.. షాకింగ్‌ ధర!

  • Published Jul 28, 2023 | 11:51 AM Updated Updated Jul 28, 2023 | 11:51 AM
  • Published Jul 28, 2023 | 11:51 AMUpdated Jul 28, 2023 | 11:51 AM
ఈషా అంబానీ మెడలో అత్యంత ఖరీదైన నెక్లస్‌.. షాకింగ్‌ ధర!

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు. ఇది కొన్ని విషయాల్లో నిజమే అనిపిస్తుంది. డబ్బున్న వాళ్లు బతికే లగ్జరీ లైఫ్‌ ఒక్కోసారి నోరెళ్లబెట్టిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్‌ అంబానీ కుటుంబం లగ్జరీ లైఫ్‌ షాకింగ్‌గా ఉంటుంది. తాగే టీకప్పులనుంచి తిరిగే విమానాల వరకు అన్నీ చాలా లగ్జరీగా ఉంటాయి. వారు వాడే వస్తువులకు సంబంధించిన ధరలు అప్పుడప్పుడు మీడియాలో వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకున్నపుడు పేద, మధ్య తరగతి, మోస్తరు ధనవంతులు కూడా నోరెళ్లబెడుతూ ఉంటారు.

ప్రస్తుతం ముఖేష్‌ అంబానీ గారాల పట్టి ఈషా అంబానీ వేసుకునే ఓ నెక్లెస్‌ ధర మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆమె అత్యంత ఖరీదైన అన్‌ డైమండ్‌ నెక్లెస్‌ ధరిస్తోంది. ఆ డైమండ్‌ ధర అక్షరాల 165 కోట్ల రూపాయలట. అయితే, ఈషా ఈ నగను ఎక్కువగా ధరించదు. ఆమె ఈ నగను మొట్టమొదటి సారి తన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో ధరించింది. తర్వాత నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ఈవెంట్‌లో ధరించింది. అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలకు సైతమే ఆమె దాన్ని ధరిస్తోంది.

ఇక, నీతా అంబానీ ఉదయాన్నే టీ తాగే టీ కప్పుల ధర కూడా సాధారణ ప్రజల్ని షాకింగ్‌కు గురి చేసింది. ఆమె అత్యంత ఖరీదైన జపనీస్‌ టీ సెట్‌ వాడుతోంది. ఆ టీ సెట్‌లోని ఒక్కో కప్పు ధర అక్షరాలా 3 లక్షల రూపాయలు. ఆ మొత్తం జపనీస్‌ టీ సెట్‌ ధర 1.5 కోట్ల రూపాయలు. అయితే, ఈ టీ కప్పు అంత ధర ఉండటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆ టీ కప్పులు మొత్తం ప్లాటినం, బంగారంతో డిజైన్‌ చేయబడ్డాయి. అందుకే వాటి ధర అంతలా ఉంది. మరి, ఈషా అంబానీ ధరించిన 165 కోట్ల నెక్లెప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom