ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్ బైక్ రిలీజ్! కేవలం 350 మందికే కొనే ఛాన్స్!

The 2024 Indian Roadmaster Elite: అమెరికాకి చెందిన ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ భారత మార్కెట్లో ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్ బైక్ ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 యూనిట్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ బైక్ ధర తెలిస్తే నిజంగా అవాక్కవుతారు.

The 2024 Indian Roadmaster Elite: అమెరికాకి చెందిన ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ భారత మార్కెట్లో ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్ బైక్ ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 యూనిట్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ బైక్ ధర తెలిస్తే నిజంగా అవాక్కవుతారు.

అమెరికన్ మోటార్ సైకిల్ కంపెనీ సరికొత్త బైక్ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇండియన్ రోడ్ మాస్టర్ ఎలైట్ పేరుతో మోస్ట్ స్టైలిష్ మోటార్ సైకిల్ ని తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఈ బైక్ కంపెనీ గురించి తెలుసుకుంటున్నవారికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే దీని ధరతో ముగ్గురు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సొంతంగా ఇళ్ళు కట్టుకోవచ్చు. హైదరాబాద్ లో ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కోవచ్చు. దీని ఎక్స్ షోరూం ధర అక్షరాలా రూ. 71.82 లక్షలు. ఇక ఆన్ రోడ్ వచ్చేసరికి 83 లక్షలు అవుతుంది. దీన్ని కేవలం కొంతమంది మాత్రమే భరించగలరు. అందరూ కొనలేరు. ఎందుకు అంత రేటు అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి మరి.  

వేసుకునే దుస్తుల్లో లార్జ్, ఎక్స్ఎల్ ఎలానో బైక్స్ లో ఇది ఎక్స్ఎల్ సైజు బైక్. ఫ్యూయల్ ట్యాంక్, ఇంజిన్ ఇలా ప్రతీది ఎక్స్ఎల్ సైజులోనే ఉంటుంది. రైడర్ తో పాటు ప్రయాణం చేసే వారికి బ్యాక్ సీట్ సోఫా స్టైల్ లో ఉంటుంది. కారులో కూర్చుని వెళ్ళినట్టే ఉంటుంది. ఎరుపు, నలుపు రంగుల్లో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గోల్డ్ కలర్ లెటర్స్ బైక్ కి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇది థండర్ స్ట్రోక్ 116, ఎయిర్ కోల్డ్ వీట్విన్ ఇంజిన్ తో వస్తుంది. 1890 సీసీతో 120 బీహెచ్పీతో, 170 ఎన్ఎంతో వస్తుంది. ఇందులో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. ఇందులో 7 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్ప్లీతో డ్యాష్ బోర్డు ఇచ్చారు. యాపిల్ కార్ ప్లేతో వస్తుంది. 46 ఎంఎం టెలీస్కోపిక్ ఫోర్క్, ఎయిర్ అడ్జస్ట్ సిస్టంతో మోనోషాక్ ఫీచర్ తో వస్తుంది.

బ్యాక్ సైడ్ 19 అంగుళాల అల్లాయ్ వీల్, ఫ్రంట్ సైడ్ 16 అంగుళాల అల్లాయ్ వీల్ ఇచ్చారు. ముందు, వెనుక 300 ఎంఎం డిస్క్ బ్రేకులు ఇచ్చారు. కూల్డ్ అండ్ హీటెడ్ సీట్స్ తో వస్తున్న ఈ బైక్ కి 600 వాట్ 12 స్పీకర్ తో కూడిన మ్యూజిక్ సిస్టంని ఇచ్చారు. దీని బరువు 412 కిలోలు. దీన్ని మోయాలంటే హల్క్ రావాలేమో. అయితే కంపెనీ కేవలం 350 బైకులని మాత్రమే తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను కేవలం కొంతమందికి మాత్రమే పరిమిత విక్రయాలు చేస్తుంది. అది కూడా అల్ట్రా ఎక్స్ క్లూజివ్ ధరకు. మరి భారత మార్కెట్లో ఈ ఖరీదైన బైకుని ఎంతమంది సొంతం చేసుకుంటారో చూడాలి. మరి ఈ ఖరీదైన బైకుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments