Vinay Kola
Fixed Deposit: బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం చాలా సురక్షితమైన మార్గం. చాలా మంచి రిటర్న్స్ వస్తాయి.
Fixed Deposit: బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం చాలా సురక్షితమైన మార్గం. చాలా మంచి రిటర్న్స్ వస్తాయి.
Vinay Kola
బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం చాలా సేఫ్. అది కూడా ప్రభుత్వ బ్యాంక్ లో దాచుకోవడం ఇంకా సేఫ్.. మనకు ఇన్వెస్ట్ మెంట్ కోసం ఎన్ని మార్గాలు ఉన్నా కానీ బ్యాంకులలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. కొన్ని బ్యాంక్స్ స్పెషల్ స్కీమ్స్ తీసుకోస్తూ ఉంటాయి. అందులో అధిక వడ్డీ రేట్లని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ రెండు ప్రత్యేక టెన్యూర్ ఎఫ్‌డీ స్కీమ్స్ ని అందిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వలన కచ్చితంగా భారీ లాభాలు పొందవచ్చు. ఇక ఇంతకీ ఆ స్కీంస్ ఏంటి? వాటి వల్ల కలిగే లాభాలు? వడ్డీ ఎంత వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం ఇండియన్ బ్యాంకులో ఇండ్ సూపర్ 300 డేస్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇండ్ సూపర్ 400 డేస్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా తమ కస్టమర్లకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తోంది బ్యాంక్. అయితే ఈ రెండు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు కేవలం కొద్ది రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈ స్కీమ్స్ గడువు నవంబర్ 30, 2024 దాకే ఉంది. ఇప్పటికే చాలా సార్లు ఈ స్కీమ్స్ గడువు పొడిగించారు. ఇక మరోసారి పొడిగించే ఛాన్స్ లేకపోవచ్చు. కాబట్టి నవంబర్ 30 లోపు ఈ స్కీంస్ లో పెట్టుబడి పెట్టండి. మీ పెట్టుబడి పై అధిక లాభాలను పొందండి. ఇక వీటిలో ఎంత ఎంత వడ్డీ వస్తుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ఇండ్ సూపర్ 300 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ విషయానికి వస్తే.. ఇందులో సాధారణ కస్టమర్లకు 7.05 శాతం వడ్డీ ఇస్తోంది ఇండియన్ బ్యాంక్. సపోజ్ వారు రూ.5 లక్షలు డిపాజిట్ కనుక చేస్తే వడ్డీ రూ.29,700 దాకా వస్తుంది. అదే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు అయితే వడ్డీ 7.55 శాతం ఉంటుంది. అప్పుడు రూ.5 లక్షలపై రూ. 31,800 దాకా వడ్డీ వస్తుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్ కి అయితే ఇంకా బెనిఫిట్ అనే చెప్పాలి. వారికి ఏకంగా 7.80 శాతం వడ్డీని ఇస్తుంది ఇండియన్ బ్యాంక్. ఇక ఈ లెక్కన రూ.5 లక్షల డిపాజిట్ పై రూ.32,850 వరకు వడ్డీ వస్తుంది.
ఇక ఇండ్ సూపర్ 400 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ విషయానికి వస్తే.. ఇండియన్ బ్యాంక్ ఇందులో సాధారణ కస్టమర్లకు 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. దీని ప్రకారం రూ.5 లక్షల డిపాజిట్ చేస్తే రూ.39,700 వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే 7.80 శాతం వడ్డీ వస్తుంది. దీంతో రూ.5 లక్షలపై రూ. 42,700 వడ్డీ లభిస్తుంది. ఇక 80 ఏళ్ల వయసు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఏకంగా 8 శాతం వడ్డీ వస్తుంది. వారు సపోజ్ ఈ స్కీమ్ లో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ రూ.43,800 దాకా వస్తుంది. సొ టోటల్ గా రూ. 5,43,800 దాకా డబ్బులు వస్తాయి. ఇదీ సంగతి. ఇక ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ రెండు స్కీమ్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.