యాపిల్ లవర్స్ కి గుడ్ న్యూస్.. 20 వేల కంటే తక్కువ ధరకే Apple iPad!

Apple: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పూర్తయ్యింది. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా Apple iPad (9th Gen) భారీ డిస్కౌంట్ తో 20 వేల కంటే తక్కువ ధరకే వచ్చేస్తుంది.

Apple: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పూర్తయ్యింది. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో భాగంగా Apple iPad (9th Gen) భారీ డిస్కౌంట్ తో 20 వేల కంటే తక్కువ ధరకే వచ్చేస్తుంది.

అదిరిపోయే ఆఫర్లతో కళ్ళు చెదిరే డిస్కౌంట్ లతో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పూర్తయ్యింది. కానీ ఆ ఆఫర్లు మిస్ అయిన వారి కోసం తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నడుస్తుంది. ఈ సేల్ లో Apple iPad (9th Gen)ని భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. కేవలం 20 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే బంపర్ ఆఫర్ ఇస్తుంది ఫ్లిప్ కార్ట్. దీపావళి, దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఈ సూపర్ ఆఫర్ ని ఇస్తుంది. యాపిల్ ఐప్యాడ్ కొనాలని అనుకుంటున్నా బడ్జెట్ కారణంగా చాలా మంది కొనలేరు. అలా బడ్జెట్ కోసం ఆలోచిస్తున్న వారికి ఇది అదిరిపోయే డీల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ యాపిల్ ఐప్యాడ్ 2021 సెప్టెంబర్ నెలలో ఇండియాలో విడుదల అయ్యింది. దీని అసలు ధర రూ. 32,900 ఉంది. కానీ ఈ ఐప్యాడ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు రూ. 12,901భారీ డిస్కౌంట్ తో వస్తుంది. కేవలం రూ. 19,999 ధరకు మాత్రమే సేల్ అవుతోంది. ఇంకా ఈ ప్యాడ్ ను మరింత చవక ధరకు కూడా సొంతం చేసుకోవచ్చు. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా ఫ్లిప్ కార్ట్ యాడ్ చేసింది. RBL, Axis, BOBCARD మరియు Yes బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఐప్యాడ్ ను ఇంకా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఏకంగా రూ. 1750 రూపాయల ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఐప్యాడ్ ని కేవలం రూ. 18,249 అదిరిపోయే డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఐప్యాడ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది A13 బయోనిక్ చిప్ సెట్ తో రన్ అవుతుంది. ఈ ఐప్యాడ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఐప్యాడ్ 10.2 ఇంచెస్ రెటినా స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ యాపిల్ పెన్సిల్ (1st జనరేషన్) సపోర్ట్ తో పాటు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఓలియా ఫోబిక్ కోటింగ్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఐప్యాడ్ కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఇది 8 ఎంపీ వైడ్ సింగిల్ రియర్ కెమెరా ఇంకా 12 ఎంపీ సెల్ఫీ కెమెరాలు కలిగి ఉంది. ఈ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో చాలా క్లారిటీగా ఫోటోలు దిగవచ్చు. అంతేగాక 3x జూమ్, సినిమాటిక్ వీడియోలను 1080p, 720p క్వాలిటీని ఈ కెమెరా అందిస్తుంది. ఈ ఐప్యాడ్ లో మరో సూపర్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీ తో వస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 20 వేల కంటే తక్కువ ధరకే వచ్చేస్తున్న ఈ యాపిల్ ఐప్యాడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments