స్పోర్టీ లుక్‌లో దుమ్మురేపుతున్న Hero కొత్త బైక్.. ధర ఎంతంటే?

Hero Xtreme 160R 4V: స్పోర్టీ లుక్ లో మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో. యూత్ ను అట్రాక్ట్ చేస్తున్న ఈ బైక్ ధర ఎంతంటే?

Hero Xtreme 160R 4V: స్పోర్టీ లుక్ లో మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో. యూత్ ను అట్రాక్ట్ చేస్తున్న ఈ బైక్ ధర ఎంతంటే?

బైక్ లవర్స్ కు మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. కొత్త బైక్ లకు డిమాండ్ పెరుగుతోంది. యూత్ అంతా న్యూ బైక్ తీసుకునేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్ తో సరికొత్త బైక్ లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ టూ వీలర్ తయారీ కంపెనీ హీరో నుంచి స్పోర్టీ లుక్ లో మరో కొత్త బైక్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ పేరిట న్యూ బైక్ ను తీసుకొచ్చింది. ఈ బైక్ యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. దీని ధర ఎంతంటే?

న్యూ బైక్ ల పట్ల ఇంట్రెస్ట్ గలవారికి హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ధర రూ. రూ.1.39 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలకు (ఎక్స్ షోరూమ్) పెరిగింది. మూడు కలర్ ఆప్షన్లతో హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ సింగిల్ ట్రిమ్ ఆప్షన్ ‘ప్రీమియం’ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్ 163.2సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 16.6 బీహెచ్పీ విద్యుత్, 14.6 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.

ఈ బైక్ కేవైబీ యూఎస్డీ సెటప్, ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ వంటివి పొందుతుంది. కొత్త 2024 ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైక్ ముందు భాగంలో 100/80-ఆర్17 సెక్షన్ టైర్, వెనుక భాగంలో 130/70-ఆర్17 సెక్షన్ టైర్ పొందుతుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఫ్యుయల్ ట్యాంక్ కెపాసిటి 12 లీటర్లు ఉంది. హీరో నుంచి వచ్చిన లేటెస్ట్ బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, యమహా ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ వీ4 మరియు హొండా ఎస్పీ160 వంటి వాటికి గట్టిపోటీ ఇవ్వనుంది.

Show comments