iDreamPost
android-app
ios-app

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ స్మార్ట్ ఫోన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ స్మార్ట్ ఫోన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. కొందరైతే ఏడాదికి ఒక ఫోన్ అని, కొత్త మోడల్ రిలీజ్ అయిందని ఇలా మార్చేస్తుంటారు. కానీ, ప్రతిసారి ఫోన్ అలా మార్చాలి అంటే చాలానే ఖర్చు అవుతుంది. కానీ, ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు ఏడాదిలో రెండు మూడు సార్లు స్పెషల్ సేల్స్ నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు స్మార్ట్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేస్తే తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయచ్చు. జులై 15- 16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్ నుంచి బెస్ట్ డిస్కౌంట్ స్మార్ట్ ఫోన్స్ మీకోసం తీసుకొచ్చాం.

ఐకూ జడ్7 5జీ:

ఐకూ కంపెనీకి భారత్ లో మంచి క్రేచ్ వచ్చింది. వివో కంపెనీకి అనుబంధ కంపెనీనే ఈ ఐకూ. ఇందులో జడ్7 మోడల్ పై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. దీని ప్రారంభ ధర రూ.23,999 కాగా 25 శాతం డిస్కౌంట్ అందిస్తూ కేవలం రూ.17,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 695 5జీ 6ఎన్ఎం ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 64 ఎంపీ వోఐఎస్ కెమెరా ఉంటుంది. 44 ఫ్లాష్ ఛార్జర్ ఉంది.

ఐకూ నియో 7 5జీ:

ఐకూ కంపెనీ నుంచి నియో 7 5జీ పైకూడా మంచి డిస్కౌంట్ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.34,999 కాగా.. 20 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.27,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ పై అదనంగా ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకుల కస్టమర్లకు 1,950 ఇన్ స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డైమెన్సిటీ 8,200, 4ఎన్ఎం ప్రాసెసర్ తో వస్తోంది. కేవలం 10 నిమిషాల్లో  50 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. గేమర్స్ కు ఈ ఫోన్ తో మంచి ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది. మోషన్ కంట్రోల్, లైనియర్ మోటర్, 64 ఎంపీ వోఐఎస్ కెమెరా, ఎక్ టెండెడ్ ర్యామ్ 8 జీబీ వరకు ఉంటుంది.

రియల్ మీ నార్జో ఎన్55:

రియల్ మీ కంపెనీ నుంచి నార్జో ఎన్55 మోడల్ పై మంచి ఆఫర్ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.14,999 కాగా ప్రస్తుతం రూ.12,999కే అందిస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 64 ఎంపీ కెమెరా ఉన్నాయి. 4జీ నెట్ వర్క్, ఆండ్రాయిడ్ 13తో వస్తోంది.

ఒప్పో ఏ78 5జీ:

ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ పై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.21,999 కాగా రూ.18,999కి అందిస్తున్నారు. దీనిపై ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకులకు సంబంధించి ఆఫర్ లభిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇందులో 50 ఎంపీ ఏఐ కెమెరా, 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss