iDreamPost
android-app
ios-app

ఎలన్‌ మస్క్‌తో భార్య ఎఫైర్‌.. గూగుల్‌ కో ఫౌండర్‌ కీలక నిర్ణయం!

ఎలన్‌ మస్క్‌తో భార్య ఎఫైర్‌.. గూగుల్‌ కో ఫౌండర్‌ కీలక నిర్ణయం!

ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌కు.. గూగుల్‌ కో ఫౌండర్‌ సెర్జీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానహాన్‌కు మధ్య ఎఫైర్‌ నడుస్తోందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫైర్‌ వార్తలపై 2022లోనే ఎలన్‌ మస్క్‌ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ అదంతా ఒట్టి పుకారు మాత్రమే. నేను సర్జే మంచి స్నేహితులం. గత రాత్రి కలిసి ఓ పార్టీలో కూడా పాల్గొన్నాము. నేను మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే నికోల్‌ను చూశాను. ఆ రెండూ సార్లు మా వెంట చాలా మంది ఉన్నారు. అందులో ఎలాంటి రొమాన్స్‌ లేదు’’ అని పేర్కొన్నారు. తర్వాత నికోల్‌ కూడా ఎఫైర్‌ ప్రచారాన్ని ఖండించింది.

తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేసింది. అయినప్పటికి ప్రచారం మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలోనే సెర్జీ బ్రిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. భార్య నికోల్‌కు విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలిద్దరూ మే 26న విడాకులు తీసుకున్నారట. వీరి కూతురికి సంబంధించిన కస్టడీ వ్యవహారం.. భరణం, కోర్టు ఖర్చులకు సంబంధించిన మిగిలిన విషయాలు కూడా క్లియర్‌ అయ్యాయట. కాగా, సెర్జీ బ్రిన్‌.. నికోల్‌ షానహాన్‌లు 2015లో డేటింగ్‌ మొదలుపెట్టారు. అదే సంవత్సరం సెర్జీ తన మొదటి భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

మూడు సంవత్సరాల తర్వాత 2018లో నికోల్‌ షానహాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. మనస్పర్థల కారణంగా 2021లో విడిపోయి వేరుగా ఉండటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే 2022లో బ్రిన్‌ విడాకులకు అప్లై చేశారు. నికోల్‌.. ఎలన్‌ మస్క్‌తో ఎఫైర్‌ పెట్టుకుందన్న వార్తలు రాగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు మేలో విడాకులు మంజూరు చేసింది. మరి, లన్‌ మస్క్‌తో భార్యకు ఎఫైర్‌ ఉందంటూ గూగుల్‌ కో ఫౌండర్‌ విడాకులు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş