2024 ఇయర్ ఎండింగ్ లోపు ఇక్కడ ఇల్లు కొంటే లక్షల్లో లాభం!

ఇల్లు కొనాలి, బాగా లాభం ఉండాలి. సిటీలో ఉండాలి, తక్కువ ధర పలకాలి ఇలాంటి రిక్వైర్ మెంట్స్ తో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏ ఏరియాలో ఇల్లు కొంటే మంచి రాబడి ఉంటుంది? ఇల్లు కొన్న ఏడాదిలో లాభం తెచ్చిపెట్టే ఏరియాలు ఏమిటో ఓ లుక్కేయండి.

ఇల్లు కొనాలి, బాగా లాభం ఉండాలి. సిటీలో ఉండాలి, తక్కువ ధర పలకాలి ఇలాంటి రిక్వైర్ మెంట్స్ తో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏ ఏరియాలో ఇల్లు కొంటే మంచి రాబడి ఉంటుంది? ఇల్లు కొన్న ఏడాదిలో లాభం తెచ్చిపెట్టే ఏరియాలు ఏమిటో ఓ లుక్కేయండి.

హైదరాబాద్ లో ఇళ్ళు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి హైదరాబాద్ లోనే ఎక్కువ ఇండ్ల అమ్మకాలు జరిగినట్లు పలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీలు తెలిపాయి. జనవరి నుంచి మార్చి నెల మధ్యలో ఇండ్ల ధరలు సగటున 10 నుంచి 32 శాతం పెరిగాయని నివేదికలో తేలింది. ఈ జనవరి-మార్చి నెలల్లో ఉన్నంత డిమాండ్ గడిచిన పదేళ్లలో కూడా లేదని అంటున్నారు. ఇండ్ల విక్రయాలు ఈసారి బాగా జరిగాయని చెబుతున్నారు. వచ్చే ఏడాది కూడా ఇదే రేంజ్ లో ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల విక్రయాలలో దేశంలో అన్ని నగరాల కన్నా హైదరాబాద్ టాప్ లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని బట్టి హైదరాబాద్ లో ఇండ్ల డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి మీరు కూడా హైదరాబాద్ లో కొంచెం తక్కువ ధరకు ఇల్లు కొనుక్కుని లాభాలు పొందాలనుకుంటున్నారా? అయితే ఏ ఏరియాల్లో ఇల్లు కొంటే మంచి లాభాలు పొందవచ్చో తెలుసుకోండి. 

అప్పా జంక్షన్ 

2023 జనవరి-మార్చి నెలల్లో అపార్ట్ మెంట్ ధరలు చదరపు అడుగు రూ. 5900 ఉంటే  2024 మార్చి నెలకు అది రూ. 8100కి పెరిగింది. ఏడాదిలో 2 వేలు పైనే పెరిగింది. అంటే 59 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తే.. దాని విలువ 81 లక్షలు అయ్యింది. ఏడాదిలో 22 లక్షలు లాభం వచ్చినట్టే.  ఏడాదిలో 37.3 శాతం వృద్ధి రేటు అనేది ఉంది ఈ ఏరియాలో. 

కౌకుర్ 

సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న కౌకుర్ లో అపార్ట్మెంట్ కొనాలంటే చదరపు అడుగుకి 6 వేలు పడుతుంది. గత ఏడాది రూ. 4350-రూ. 4400 మధ్య ఉండగా ఈ ఏడాది అది 6 వేలకు పెరిగింది. ఇక్కడ వృద్ధి రేటు కూడా 37 శాతం ఉంది. ఈ ఏరియాలో 44 లక్షలకు ఇల్లు కొంటే ఏడాదిలో దాని విలువ 60 లక్షలు అయ్యింది. అంటే ఏడాదిలో 16 లక్షలు లాభం వచ్చినట్టే. 

తెల్లాపూర్ 

గత ఏడాది జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5550 ఉండగా ఈ ఏడాది రూ. 7,150కి పెరిగింది. 30 శాతం వృద్ధి రేటు అనేది కనిపిస్తుంది. చదరపు అడుగు దగ్గర రూ. 1600 పెరిగింది. అంటే గత ఏడాది చదరపు అడుగు 5,550 రూపాయలు చొప్పున 1000 చదరపు అడుగుల ఇంటిని రూ. 55,50,000కి కొనుగోలు చేస్తే దాని విలువ రూ. 71,50,000 అయ్యింది. అంటే ఒక్క ఏడాదిలో 16 లక్షలు లాభం వచ్చినట్టు.

కొల్లూర్ 

గత ఏడాది చదరపు అడుగు రూ. 4,250 ఉంటే ఈ ఏడాది రూ. 5,250 అయ్యింది. చదరపు అడుగు మీద రూ. 1000 పెరిగింది. 1000 చదరపు అడుగుల ఇంటి మీద ఏడాదిలో పది లక్షలు లాభం వచ్చినట్టే. వృద్ధి రేటు 23 శాతంగా ఉంది. 

హఫీజ్ పేట్ 

గత ఏడాది రూ. 6,150గా ఉన్న చదరపు అడుగు ఈ ఏడాది రూ. 7,650కి పెరిగింది. వృద్ధి రేటు 24 శాతంగా ఉంది. 

శంషాబాద్ 

ఏడాది క్రితం 5 వేలు ఉన్న చదరపు అడుగు ఈ ఏడాది రూ. 6,350కి పెరిగింది. అంటే 50 లక్షలు పెట్టి కొన్న అపార్ట్మెంట్ లేదా ఇంటి విలువ 63 లక్షలు అయ్యింది. ఏడాదిలో 13 లక్షలు పెరిగినట్టు. ఇక్కడ వృద్ధి రేటు 22 శాతంగా ఉంది.  

మోకిల

గత ఏడాది మోకిలలో చదరపు అడుగు రూ. 4800 ఉంటే ఈ ఏడాది రూ. 5,850 అయ్యింది. చదరపు అడుగు మీద రూ. 1000 పెరిగింది. అంటే ఇల్లు కొనుగోలు మీద ఏడాదిలో పది లక్షలు లాభం వచ్చినట్టే. ఇక్కడ వృద్ధి రేటు 21 శాతంగా ఉంది. 

పైన చెప్పిన ఏరియాలతో పాటు ఉస్మాన్ నగర్, పటాన్ చేరు, మలక్ పేట్, హస్తినాపురం, ప్రగతి నగర్, బీరంగూడ, బాచుపల్లి, మల్లంపేట్, మల్లాపూర్, ఆదిభట్ల, కాప్రా, నాగోల్, అల్వాల్, గాజులరామారం, మల్కాజ్ గిరి వంటి ఏరియాల్లో ఇల్లు కొనుగోలు చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. డిమాండ్ కి తగ్గట్టు ఏడాది తర్వాత ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇళ్ల విక్రయాల విషయంలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి 30 నుంచి 50 లక్షల బడ్జెట్ లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఎలా కాదన్న పెట్టిన పెట్టుబడి మీద కనీసం 10 లక్షలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాపర్టీ కొనే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. 

Show comments