Gautam Adani: అదానీ చేతుల్లోకి అంబానీ భారీ ప్రాజెక్ట్.. ఏకంగా వేల కోట్లకు డీల్

Gautam Adani-Anil Ambani Power Plant: అంబానీకి చెందిన ఓ భారీ ప్రాజెక్ట్‌ని అదానీ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

Gautam Adani-Anil Ambani Power Plant: అంబానీకి చెందిన ఓ భారీ ప్రాజెక్ట్‌ని అదానీ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

గౌతమ్‌ అదానీ.. ఇండియా కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన దిగ్గజ వ్యాపారవేత్త. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో అదానీకి వ్యాపారాలున్నాయి. ఒకప్పుడు ఇండియా కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అదానీ.. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తర్వాత కిందకు పడిపోయారు. కానీ ఆ ప్రభావం కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత కూడా ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. కొత్త కొత్త డీల్స్‌ చేస్తూ.. వ్యాపార రంగంలో దూసుకుపోతున్న గౌతమ్‌ అదానీ.. మరో భారీ డీల్‌ ఓకే చేయబోతున్నారని సమాచారం. అంబానీకి చెందిన భారీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోబుతున్నారని సమాచారం. ఆ వివరాలు..

అంబానీకి చెందిన భారీ ప్రాజెక్ట్‌ను ఒకదాన్ని గౌతమ్‌ అదానీ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఆయన దక్కించుకుంది ముకేష్ అంబానీకి చెందిన ప్రాజెక్ట్‌ కాదు. ఆయన సోదరుడు అనిల్‌ అంబానీకి చెందిన ఓ భారీ ప్రాజెక్ట్‌ను అదానీ దక్కించుకోనున్నారట. అంబానీకి చెందిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకదానిని కొనేందుకు అదానీ ఆసక్తి చూపిస్తున్నారట. దీని గురించి చర్చలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు.. నాగ్‌పూర్‌లో 600 మెగావాట్ల సామర్థ్యంతో బుటిబోరి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇక గతంలో ఈ రిలయన్స్ పవర్ ప్లాంట్ల నిర్వహణ కోసం.. అనిల్ అంబానీ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారు.. కానీ వాటిని చెల్లించేలేకపోయారు. ఆంతో ఈ ప్లాంట్‌ అనిల్‌ అంబానీ చేజారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పవర్.. ఈ సంస్థను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ కొనుగోలుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని బిజినెస్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ డీల్‌ విలువ సుమారు రూ. 2400 కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. అంటే ఒక్కో మెగావాట్‌కు రూ. 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందంట. ఈ కొనుగోలు కోసం సీఎఫ్ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌తో అదానీ పవర్ చర్చలు జరుపుతోందని సమాచారం. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని.. అదానీ పవర్ తన వ్యాపారాల్ని మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు అనిల్‌ అంబానీ పవర్‌ ప్లాంట్‌ కొనుగోలు నిర్ణయం అంటున్నారు.

ఇక ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కూడా ఒకప్పుడు ప్రంపచ కుబేరుల జాబితాలో భారత్ నుంచి స్థానం దక్కించుకున్నారు. తర్వాత్తర్వాత.. వ్యాపారాల్ని విస్తరించే క్రమంలో అప్పుల్లో కూరుకుపోయి దాదాపు దివాలా పరిస్థితికి పడిపోయారు. ఒకానొక దశలో తన ఆస్తుల్ని సున్నాగా కూడా పేర్కొన్నారు.

Show comments