Dharani
Gautam Adani Retirement: ప్రస్తుతం ఎక్కడ చూసినా గౌతమ్ అదానీ రిటైర్మెంట్ గురించే చర్చ. ఇంతకు ఆయన ఎప్పుడు రిటైర్ అవుతున్నారు.. తర్వాత వారసులు ఎవరూ అంటే..
Gautam Adani Retirement: ప్రస్తుతం ఎక్కడ చూసినా గౌతమ్ అదానీ రిటైర్మెంట్ గురించే చర్చ. ఇంతకు ఆయన ఎప్పుడు రిటైర్ అవుతున్నారు.. తర్వాత వారసులు ఎవరూ అంటే..
Dharani
గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఇండియాలో రెండో అత్యంత ధనవంతుడు. మన దేశంలో తరచుగా వినిపించే వ్యాపారవేత్తల పేర్లు అంబానీ, అదానీలయే. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను విస్తరిస్తూ.. వేల కోట్ల పెట్టుబడులతో.. ఎందరికో ఉపాధి కల్పిస్తూ.. దిగ్గజ వ్యాపారవేత్తలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు కుమారుడి పెళ్లి వార్తలతో ముఖేష్ అంబానీ పేరు వార్తల్లో నిలవగా.. ఇక నేడు మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గౌతమ్ అదానీ పేరే వినిపిస్తోంది, కనిపిస్తుంది. అందుకు కారణం గౌతమ్ అదానీ రిటైర్మెంట్ ప్రకటన. ఈ న్యూస్ ఇప్పుడు బిజినెస్ సర్కిళ్లల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి గౌతమ్ అదానీ రిటైర్మెంట్ ఎప్పుడు.. ఆయన తర్వాత వ్యాపారాలన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తాయి అంటే..
ఇండియాలోనే రెండో అత్యంత ధనవంతుడు, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ తన వారసత్వ ప్రణాళిలకలు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను ఎప్పుడు వ్యాపార బాధ్యతల నుంచి తప్పుకుంటాను అన్న దానిపై కూడా ప్రకటన చేశారు. తన 70 వ ఏట పదవీవిరమణ చేసి.. బాధ్యతల నుంచి వైదొలగుతానని ప్రకటించాడు అదానీ. ప్రస్తుతం ఆయన వయసు 62 ఏళ్లు. అంటే మరో 8 ఏళ్ల తర్వాత ఆయన రిటైర్మెంట్ ఉండనుంది అన్నమాట. మరి అదానీ తర్వాత.. ఆయన వ్యాపారలన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తాయి.. అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం అదానీకి ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, సిమెంట్, పునరుత్పాదక ఇంధన, గ్యాస్ వంటి విబిన్న రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ అదానీ నేతృత్వంలోనే కొనసాగుతున్నాయి.
మరి ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2030లో అదానీ రిటైర్ అవుతారు.. అప్పుడు ఈ వ్యాపారాలన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తాయి.. ఎవరు బాధ్యతలు స్వీరిస్తారు అంటే.. అదానీ తర్వాత ఆయన వ్యాపారాలన్నీ.. కుమారులకు అప్పగించనున్నారు. బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు. దీని ప్రకారం.. అదానీ రిటైర్మెంట్ తర్వాత.. ఆయన కుమారుడు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీలకు సమాన వాటా లభిస్తుందని బ్లూమ్‌బెర్గ్ కథనం వెల్లడించింది. ప్రస్తుతం అదానీ కుమారుడు.. కరణ్.. అదానీ పోర్ట్స్ ఎండీగా కొనసాగుతుండగా.. జీత్ అదానీ.. ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలానే ప్రణవ్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్‌గా.. సాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
మరి అదానీ రిటైర్మెంట్ తర్వాత.. ఆయన వారసులు వ్యాపారాలను కలిసికట్టుగా ఉండి నిర్వహిస్తారా.. లేక వేరుగా ఉంటారా అని ప్రశ్నించగా.. కలిసే ముందుకు వెళ్తామని అదానీ వారసులు సమాధానం చెప్పుకొచ్చారని బ్లూమ్‌బెర్గ్ కథనం చెప్పుకొచ్చింది. ఇక అదానీ కూడా తన తర్వాత వచ్చే వారసులు.. నిబద్ధతతో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.