HOME LOAN ఫాస్ట్ గా ఈజీగా కావాలా? అయితే ఇలా చేయండి..!

HOME LOAN: చాలా మంది కూడా హోమ్ లోన్ కి అప్లై చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి కూడా త్వరగా రాదు.

HOME LOAN: చాలా మంది కూడా హోమ్ లోన్ కి అప్లై చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి కూడా త్వరగా రాదు.

చాలా మంది ఇంటిని కొనడానికి లేదా కట్టుకోవడానికి బ్యాంక్ లోన్‌ కి అప్లై చేస్తుంటారు. ఈ కాలంలో ఇలా హోమ్ లోన్స్ తీసుకుంటున్న వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే హోమ్ లోన్ అనేది అంత ఈజీగా రాదు. చాలా కష్టం. ఎందుకంటే దీనికి ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా రకాల ఛార్జీలు ఉంటాయి. పైగా వడ్డీ రేట్లు కూడా తక్కువేం కాదు. చాలా ఎక్కువే ఉంటాయి. అయితే ఈ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. ఇక ఈ హోం లోన్ రావాలంటే కొన్ని సార్లు చాలా టైమ్ పడుతుంది. వేగంగా శాంక్షన్ అవ్వదు. కాబట్టి లోన్ అప్లై చేసే ముందు అది త్వరగా రావాలంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.ఇక లోన్ త్వరగా రావాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎప్పుడైనా కానీ హోం లోన్ ఇండివిడ్యువల్‌గా తీసుకోకూడదు. జాయింట్‌గా తీసుకుంటే మంచిది. అంటే ఇంట్లో సంపాదిస్తున్న భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అప్లై చేయడం వల్ల లోన్ స్పీడ్ గా, ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెండు సంపాదనలు ఉనాటాయి. అందువల్ల లోన్ రీపేమెంట్స్ ఈజీగా జరుగుతాయి. ఎలాంటి డీఫాల్ట్ లేకుండా ఉంటాయి. అందుకే బ్యాంకులు జాయింట్ హోమ్ లోన్స్ ని స్పీడ్ గా శాంక్షన్ చేస్తాయి. అలాగే మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకును లేదా ఇప్పటికే లోన్లు తీసుకొని సకాలంలో తీర్చేసిన బ్యాంకును ఎంచుకుంటే లోన్ త్వరగా వస్తుంది. ఎందుకంటే మీ పేమెంట్ హిస్టరీ ఆ బ్యాంకుకు తెలిసుంటుంది కాబట్టి లోన్ ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్ గా జరుగుతుంది. మామూలుగా బ్యాంకులు ఇంటి విలువపై 80 నుంచి 90 శాతం దాకా లోన్ ఇస్తాయి. మిగతా 10-20 శాతం అమౌంట్ ని మీరు డౌన్ పేమెంట్‌గా కట్టాల్సి ఉంటుంది. అయితే మనం అవసరమైన దాని కంటే ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టడం వల్ల బ్యాంక్ మనపై నమ్మకం ఉంచుతుంది. అందువల్ల లోన్ త్వరగా వస్తుంది.

అయితే వీటన్నిటి కంటే లోన్ అప్లై చేసే ముందు మీరు కచ్చితంగా ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏ బ్యాంక్ అయినా కూడా లోన్ ఇచ్చే ముందు కచ్చితంగా ముందుగా చూసేది సిబిల్ స్కోరునే. సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. సాధారణంగా క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే.. అప్పుడు లోన్ ఫాస్ట్ గా వస్తుంది. ఫాస్ట్ గా రావడమే కాకుండా.. వడ్డీ రేట్లు కూడా ఇక్కడ తక్కువగా అప్లై అవుతాయి. అందుకే హోం లోన్ కావాలనుకునేవారు కచ్చితంగా ఏడాది ముందు నుంచే మీ సిబిల్ స్కోరును పెంచుకునేందుకు ట్రై చేయండి. లోన్లపై సకాలంలో ఈఎంఐ కడుతుంటే గనుక అప్పుడు ఆటోమ్యాటిక్ గా క్రెడిట్ స్కోరు పెరిగిపోతుంది. ఇదీ సంగతి. కాబట్టి హోమ్ లోన్ ఫాస్ట్ గా రావాలి అనుకునేవారు కచ్చితంగా ఈ విషయాలు గుర్తు పెట్టుకొని అప్లై చేసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments