ఈ రూల్స్ తెలియకుండా విదేశాల నుంచి బంగారం తెచ్చుకుంటున్నారా! జైలుకు వెళ్లే ఛాన్స్..

ప్రస్తుతం గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టినా కూడా.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో విదేశాల నుంచి బంగారం తీసుకుని వచ్చే వారికీ భారతీయ కస్టమ్స్ కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకుని వచ్చింది.

ప్రస్తుతం గత కొన్ని నెలలుగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు మూడు రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టినా కూడా.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో విదేశాల నుంచి బంగారం తీసుకుని వచ్చే వారికీ భారతీయ కస్టమ్స్ కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకుని వచ్చింది.

భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి. అయితే, గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. బంగారం ధర తులం రేటు రూ.70 వేలు దాటింది. దీనితో అందరు దీనిపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా కూడా.. మళ్ళీ అవి పెరిగే అవకాశం లేకపోలేదు. దీనితో శుభకార్యాలకు బంగారం కొనాలి అనుకునే వారికి.. వచ్చే ఆలోచన విదేశాల నుంచి బంగారం తెప్పించుకోవటం. చాలా మంది విదేశాల నుంచి బంగారం తీసుకొస్తే తక్కువ ధర పలుకుతుందని భావిస్తారు. అయితే, ఎయిర్పోర్ట్స్ లో బంగారం తరలిస్తుండగా పట్టుబడిన వ్యక్తులు అని అప్పుడప్పుడు మనం వార్తలు వింటూనే ఉంటాం. కొంతమంది అక్రమ పద్ధతులలో బంగారాన్ని తరలిస్తూ ఉంటారు. మరి, విదేశాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఉచితంగా బంగారం తరలించేందుకు.. ఒక వ్యక్తికీ ఎంత లిమిట్ ఉంటుంది! వీటి గురించి కస్టమ్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి! అనే విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అయితే, విదేశాలలో తక్కువ ధరలకు బంగారం లభించే మాట నిజమే.. కానీ దానిని ఇండియాకు తీసుకుని వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచి మన దేశానికీ బంగారం తీసుకుని రావడం అనేది అక్రమం కాదని.. కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కానీ, దానికి తగిన అమౌంట్ ను చెల్లించకుండా తరలిస్తే మాత్రం దానిని స్మగ్లింగ్‌గా పరిగణిస్తారట. బంగారం తీసుకుని రావడంపై మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోతేనే స్మగ్లింగ్ కిందకు వస్తుందని కస్టమ్స్ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ఇక ఎవరైనా విదేశాలలో ఆరు నెలలలోపే ఉండి.. తిరిగి వచ్చేటపుడు బంగారం తీసుకుని వస్తే మాత్రం దానిపై 38.5 శాతం మేర కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఉండి తిరిగి వచ్చే వారు 13.75 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. ఇక పురుషులు అయితే 20 గ్రాములు, మహిళలు అయితే 40 గ్రాముల వరకు క్యారీ చేయొచ్చు. దీనికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫ్రీ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బంగారాన్ని తీసుకుని రావొచ్చు. ఒకవేళ ఈ లిమిట్ దాటితే కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే మాత్రం జైలుకు వెళ్లాల్సి వస్తుంది. వారితో పాటు తెచ్చిన బంగారాన్ని కూడా మొత్తం అధికారులకు అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే చాలా మంది స్మగ్లింగ్ చేసేవారు కొద్ది రోజులు విదేశాల్లో ఉండి.. అక్కడి నుంచి పావు కిలో, కిలో అంటూ బంగారాన్ని బిస్కెట్ల రూపంలోనో నగల రూపంలోనో తీసుకుని వస్తుంటారు. ఇప్పటివరకు చాలా సినిమాలలో ఈ సీన్స్ అందరు చూసి ఉంటారు. బయట కూడా అలానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి విదేశాల నుంచి బంగారాన్ని తీసుకుని రావాలి అనుకునే వారు ఈ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments