Reliance Disney Merger CCI: రూ.70 వేల కోట్ల డిస్నీ, రిలయన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం!

Mukesh Ambani Master Plan To Compete With Netflix, Amazon Prime: విదేశీ కంపెనీలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు అంబానీ వేసిన మాస్టర్ ప్లాన్ కి ఎట్టకేలకు సీసీఐ ఆమోదం తెలిపింది. దీంతో విదేశీ కంపెనీలకు ఊహించని దెబ్బ ఎదురవ్వనుంది.

Mukesh Ambani Master Plan To Compete With Netflix, Amazon Prime: విదేశీ కంపెనీలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు అంబానీ వేసిన మాస్టర్ ప్లాన్ కి ఎట్టకేలకు సీసీఐ ఆమోదం తెలిపింది. దీంతో విదేశీ కంపెనీలకు ఊహించని దెబ్బ ఎదురవ్వనుంది.

వాల్ట్ డిస్నీ కో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలు తమ భారతీయ మీడియా ఆస్తుల విలీనానికి సంబంధించిన నియంత్రణ ఆమోదాన్ని బుధవారం నాడు పొందాయి. 8.5 బిలియన్ డాలర్లు మన కరెన్సీ ప్రకారం 70 వేల కోట్ల పై మేర ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. రిలయన్స్  లిమిటెడ్, వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా లిమిటెడ్, స్టార్  ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ విలీనాన్ని సీసీఐ ఆమోదించింది. ఈ విలీనంతో రెండు కంపెనీలు భారతదేశపు అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ సంస్థను సృష్టించేందుకు మరింత దగ్గరయ్యాయి. ఈ విలీనంతో 120 టీవీ ఛానల్స్, రెండు స్ట్రీమింగ్ సర్వీసులతో ఈ రెండు కంపెనీలు.. సోనీ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ విలీనంలో టెలివిజన్, స్ట్రీమింగ్ వేదికలకు సంబంధించి రెండు కంపెనీల వాటా ఈ విధంగా ఉంది.

టెలివిజన్:

వయాకామ్ 18 కంపెనీలో అగ్ర భాగం వాటా రిలయన్స్ కి ఉంది. కామెడీ సెంట్రల్, నిక్లోడియన్, ఎంటీవీ సహా 40 టీవీ ఛానల్స్ ఉన్నాయి. డిస్నీ స్టార్ 80 టీవీ ఛానల్స్ ఉన్నాయి. హిందీ ఫ్యామిలీ డ్రామాలకు, హాలీవుడ్ సినిమాలకి ప్రసిద్ధి చెందింది. ఇక క్రికెట్ విషయానికొస్తే.. వయాకామ్ 18కి బీసీసీఐ నిర్వహించే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల ప్రసార టీవీ హక్కులను కలిగి ఉంది. ఇక డిస్నీకి 2027 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార టీవీ హక్కులను కలిగి ఉంది. ఈ రెండు కంపెనీల ఛానల్స్ సాధారణ వినోదం, క్రీడలు, పిల్లల టీవీ, డాక్యుమెంటరీలు, లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్స్ వంటి వాటిని కలిగి ఉంటాయి. వీటినే కాకుండా ప్రాంతీయ భాషలకు చెందిన ఛానల్స్ ని కూడా ఈ రెండు కంపెనీలు కవర్ చేస్తాయి.    

స్ట్రీమింగ్:

2027 వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే క్రికెట్ మ్యాచుల ప్రసారానికి సంబంధించిన డిజిటల్ హక్కులను డిస్నీ కలిగి ఉంది. 2027 వరకూ ఐపీఎల్ మ్యాచుల ప్రసారానికి సంబంధించిన డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. రిలయన్స్ జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ కంపెనీల సంయుక్త లైబ్రరీలో 2 లక్షల గంటలకు పైగా కంటెంట్ ఉంది. వీటిలో టెలివిజన్ డ్రామాలు, సినిమాలు, క్రీడా కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్ కూడా ఉంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈవై నివేదికల ప్రకారం.. 2022లో ఎంఎక్స్ ప్లేయర్ తర్వాత ఎక్కువ డౌన్ లోడ్ చేయబడిన వీడియో స్ట్రీమింగ్ యాప్స్ లో డిస్నీ హాట్ స్టార్ రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ బ్లాక్ బస్టర్స్, మర్వెల్ యూనివర్స్ కి చెందిన సినిమాలు, నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలు సహా అనేక ఇతర స్ట్రీమింగ్ కంటెంట్ డిస్నీ కలిగి ఉంది.

2022లో దేశంలోని ఎక్కువ  వీక్షించిన టాప్ 15  ఒరిజినల్ షోస్ లో ఏడు షోస్ డిస్నీనే స్ట్రీమింగ్ చేసిందని మీడియా కన్సల్టింగ్ ఫర్మ్ ఆర్మాక్స్ తన నివేదికలో తెలిపింది. అలాంటి డిస్నీతో రిలయన్స్ చేతులు కలిపింది. ఈ కలయికతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కంపెనీలకు ఊహించని దెబ్బ ఎదురవ్వడం పక్కా అని అంటున్నారు. ఇక ముకేశ్ అంబానీకి చెందిన జియో సినిమా గత ఏడాది మరింత ఎక్కువ హాలీవుడ్ కంటెంట్ ని, అంతర్జాతీయ కంటెంట్ ని జియో సినిమాలో స్ట్రీమింగ్ చేసేందుకు వార్నర్ బ్రోస్, పోకీమాన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ డీల్ సెట్ అయితే కనుక నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి చుక్కలు కనబడడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఇతర సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు అంబానీ వేసిన మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.

Show comments