Vinay Kola
Moto G85: మోటో జి85 పై ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బంపర్ ఆఫర్ నడుస్తుంది. దీని ఫీచర్లు సూపర్ అనే చెప్పాలి.
Moto G85: మోటో జి85 పై ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బంపర్ ఆఫర్ నడుస్తుంది. దీని ఫీచర్లు సూపర్ అనే చెప్పాలి.
Vinay Kola
తక్కువ ధరలో టాప్ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనడం కొంచెం కష్టమే. అయితే అలాంటి వారి కోసం ఫ్లిప్ కార్ట్ ఓ సూపర్ ఆఫర్ ఇస్తుంది. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న బ్రాండ్ మోటోరోలా. మోటోరోలా నుంచి బడ్జెట్ లెవెల్ లో చాలా మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అలాంటి వాటిల్లో మోటో జీ85 ఒకటి. దీని అసలు ధర రూ. 20,999గా ఉంది. కానీ దీన్ని మనం ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో చాలా ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. హార్డ్ వేర్ నుంచి సాఫ్ట్ వేర్ దాకా అన్ని టాప్ క్లాస్ ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. దీనిలో కూడా మాక్సిమం మోటో ఎడ్జ్ సిరీస్ ఫీచర్లు ఉంటాయి. కర్వ్డ్ డిస్ ప్లే, లైట్ వెయిట్ డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అలాగే సూపర్ పర్ఫార్మన్స్ ని కూడా ఈ ఫోన్ ఇస్తుంది. మోటో జీ-సిరీస్లో సోనీ లిషియా 600 కెమెరా సెన్సార్ తో వచ్చిన ఫస్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఇలాంటి ప్రీమియం ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది. సొ ఈ ఫోన్ పై ఉన్న ఆఫర్ల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
ఈ ఫోన్ పై రూ. 4000 డిస్కౌంట్ ఉంది. దాంతో ఈ ఫోన్ ని కేవలం రూ. 16,999కే కొనవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కంటే రూ. 1000 ఇంస్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇంకా ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మోటోజీ85 చాలా లైట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది స్లిమ్ డిజైన్ తో వస్తుంది. దీని లెదర్ బ్యాక్ ప్యానెల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది మంచి గ్రిప్ ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కి 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7- ఇంచెస్ పీఓఎల్ఈడీ కర్వ్డ్-డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1600నిట్‌ల పీక్ బ్రైట్ నెస్ ని ఇస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 దీనికి ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఫోన్ లో ఇంకో సూపర్ ఫీచర్ ఏంటంటే హై-ఎండ్ మోటో ఎడ్జ్ సిరీస్ లాగా ఉండే కర్వ్ డ్ డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే చాలా పవర్ఫుల్ డిస్ప్లే.ఇక చిప్ సెట్ విషయానికి వస్తే .. ఈ మోటో జీ85 స్నాప్‌డ్రాగన్ 6 జెన్3 చిప్‌సెట్‌తో వస్తుంది.
ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ లలో ఉండే స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ఉంటుంది. అలాగే ప్రీమియం మోటో ఎడ్జ్ సిరీస్ కి ఉండే కొన్ని అప్డెటెడ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. ఫ్యామిలి స్పేస్, మోటో అన్ ప్లగ్డ్ లాంటి యుటిలిటీ ఫీచర్‌లు ఈ ఫోన్లో ఉంటాయి.ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. బ్యాటరీ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ కూడా స్పీడ్ గా ఎక్కుతుంది. ఈ ఫోన్‌ను 0 పర్సెంట్ నుంచి 100 పర్సెంట్ కి ఛార్జ్ చేయడానికి కేవలం 80 నిమిషాలు మాత్రమే టైమ్ పడుతుంది.మోటో జీ సిరీస్ లో మోటో జీ85 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను కలిగి ఉన్న ఫస్ట్ ఫోన్. ఇది 50-మెగాపిక్సెల్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వెనుక డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో డేలైట్, నైట్‌లైట్ ఫోటోలు రెండూ కూడా బ్రైట్ గా క్లారిటీగా దిగవచ్చు. ఇక ఈ ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.