BSNL నుంచి మరో సూపర్ రీచార్జ్ ప్లాన్! బెనిఫిట్స్ మాములుగా లేవు..

BSNL RS.997 Recharge Plane: ప్రస్తుతం ప్రముఖ ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు వినియోగదారులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎన్ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

BSNL RS.997 Recharge Plane: ప్రస్తుతం ప్రముఖ ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు వినియోగదారులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎన్ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఇటీవల మొబైల్ వినియోగదారులకు టెలికాం సంస్ధలు దిమ్మతిరిగే షాకిచ్చిన సంగతి తెలిసింది. రీచార్జ్ ఫ్లాన్  ధరలను పెంచి..కస్టమర్లను ఆశ్చర్యానికి గురి చేశారు. తొలుత జియో ప్రిపెయిట్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచగా..అదే బాటలో మిగిలిన కంపెనీలు చేరాయి. దీంతో జియోతో సహా మిగిలిన ప్రైవేటు టెలికాం సంస్థలపై వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రముఖ ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎన్ఎన్ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.  ఇప్పటికే పలు ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించగా..తాజాగా మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ అందిస్తున్న ప్రముఖ రీచార్జ్ ఫ్లాన్ లో  రూ. 997 రీఛార్జ్ ప్లాన్ ఒకటి. ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న ప్లాన్లలో రూ.997 రీఛార్జ్ ప్లాన్ కూడా ఒకటి. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 160 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ల్ ద్వారా 160 రోజులకుగానూ ప్రతి రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 320జీబీ డేటా అందిస్తోంది. దీంతో పాటు రోజుకు 100 మెసేజ్ లు, అన్‌లిమిటెడ్  ఫ్రీ కాలింగ్స్ ఉన్నాయి. అదే విధంగా ఏదైనా నెట్‌వర్క్‌లో ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్‌ కూడా ఆస్వాదించవచ్చు. దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ నుండి ప్రయోజనం పొందవచ్చు.

ఇక ఈ రీచార్జ్ ప్లాన్ చూసినట్లు అయితే రూ.997 అనేది కాస్తా ఎక్కువ ధర అనిపిస్తుంది. అయితే 160 రోజుల వ్యాలిడిటీ చూసుకున్నట్లు అయితే సరసమైన ధరే అని పలువురు వినియోగాదారులు చెబుతున్నారు. ఇతర నెట్‌వర్క్‌లలో చూసినట్లు అయితే 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్ ప్లాన్లపైనే రూ.700 నుంచి రూ.750 వరకూ వసూలు చేస్తున్నారు. వాటితో పోలీస్తే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు ఇప్పటికే రూ.249 రీఛార్జ్ ప్లాన్ ను కూడా బీఎస్ఎన్ల్ అందిస్తున్న సంగతి తెలిసింది.

ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలపై  దృష్టి పెట్టింది. అంతేకాకుండా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 4G సేవ కోసం అన్ని టెలికాం సర్కిల్‌లలో అనేక కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. అలానే 5 జీ నెట్‌వర్క్ పరీక్షలను కూడా బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. రాబోవు నాలుగైదు నెలల్లో 5జీసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీఎస్ఎన్ తీసుకొచ్చిన ఈ కొత్త రీచార్జ్ ఫ్లాన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇలా బీఎస్ఎన్ఎల్ తీసుకుంటున్న చర్యలు రీఛార్జ్ ప్లాన్లతో కస్టమర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు టెలికాం మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.

Show comments