అంబానీ, అదానీలను వెనక్కి నెట్టిన మహిళ.. సంపాదనలో అగ్రస్థానం.. ఆవిడ ఎవరంటే

Savitri Jindal Beats Ambani Adani: ప్రపంచ కుబేరులు, దేశంలోనే ఐశ్వర్యవంతులు అనగానే అంబానీ, అదానీలు గుర్తుకు వస్తారు. అయితే ఈ ఏడాది ఓ మహిళ వారిద్దరని వెనక్కి నెట్టి.. ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె ఎవరంటే..

Savitri Jindal Beats Ambani Adani: ప్రపంచ కుబేరులు, దేశంలోనే ఐశ్వర్యవంతులు అనగానే అంబానీ, అదానీలు గుర్తుకు వస్తారు. అయితే ఈ ఏడాది ఓ మహిళ వారిద్దరని వెనక్కి నెట్టి.. ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె ఎవరంటే..

ప్రపంచ కుబేరుల జాజితాలో భారతీయులు.. ఇండియాలోనే ధనవంతులు అనే జాబితాల పేరు వినపడగానే ముందుగా గుర్తుకు వచ్చేది ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల పేర్లు మాత్రమే. అనేక రకాల వ్యాపారాలు చేస్తూ.. రోజుకు కోట్ల రూపాయల సంపాదన ఆర్జిస్తూ.. ప్రపంచ కుబేరులతో పోటీ పడుతుంటారు వీరిద్దరూ. అయితే ఈ సారి అందుకు కాస్త భిన్నమైన సీన్ కనిపించింది. ఈ ఏడాది ఓ మహిళ.. సంపాదనలో అంబానీ, అదానీలను వెనక్కి నెట్టి.. మరీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇంతకు ఎవరా మహిళ.. ఈ రికార్డ్ క్రియేట్ చేయడం ఉలా సాధ్యం అయ్యింది.. అనే వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం..

దేశీయంగా ఈ ఏడాది అత్యధికంగా సంపద ఆర్జించిన వారి జాబితాలో అంబానీ, అదానీలను వెనక్కి నెట్టి.. ప్రథమ స్థానంలో నిలిచారు సావిత్రి జిందాల్. ఆమె మొత్తం సంపద 25.3 బి.డాలర్లుగా ఉండగా.. ఈ ఒక్క ఏడాదిలోనే సావిత్రి జిందాల్ సంపద ఏకంగా 9.6 బి.డాలర్లు పెరిగిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ నివేదిక తెలిపింది. జిందాల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు ఓం ప్రకాశ్‌ జిందాల్‌ సతీమణే ఈ సావిత్రి జిందాల్‌. ఓం ప్రకాశ్ జిందాల్ మరణానంతరం ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌గా సావిత్రి జిందాల్ వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ వంటి అనేక కంపెనీలు ఉన్నాయి.

వీటిల్లో చాలా వరకు కంపెనీల షేర్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో పరుగులు పెట్టడం వల్లే సావిత్రి జిందాల్‌ వ్యక్తిగత సంపద భారీగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ నివేదిక వెల్లడించింది. దాంతో దేశీయ కుబేరుల జాబితాలో ఆమె 5వ స్థానానికి ఎగబాకారు. అంతేకాక భారత ఉప ఖండంలోని మహిళా సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్ దే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో ఆమె.. అజీమ్‌ ప్రేమ్‌జీ (దాదాపు 24 బి.డాలర్లు)ని వెనక్కి నెట్టారు.

రెండో స్థానంలో శివ్‌నాడార్‌

ఇక ఈ ఏడాది 2023లో ఎక్కువ సంపద ఆర్జించిన వారి లిస్ట్‌లో సావిత్రి జిందాల్ 9.6 బి.డాలర్ల సంపదతో ప్రథమ స్థానంలో నిలవగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడార్‌ 8 బిలియన్‌ డాలర్లతో దేశంలో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ కేపీ సింగ్‌ మూడో స్థానంలో నిలిచారు. అలానే ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ బిర్లా, షాపూర్‌ మిస్త్రీ 6.3 బిలియన్‌ డాలర్ల చొప్పున తమ వ్యక్తిగత సంపదను పెంచుకున్నారు.

ఇక ఈ ఏడాది ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపద 5.2 బిలియన్‌ డాలర్లే పెరిగడం గమనార్హం. అంబానీ తర్వాతి స్థానాల్లో.. సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్‌ మిట్టల్ నిలిచారు. ఇక హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక అనంతరం గౌతమ్‌ అదానీ సంపద విలువ ఈ ఏడాది 35.4 బిలియన్‌ డాలర్లు తగ్గినట్లు తెలిసింది. అయినా సరే అదానీ.. మొత్తంగా 85.1 బి.డాలర్ల నికర సంపదతో దేశంలోని కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ దేశీయంగా తొలి స్థానంలో నిలిచారు.

Show comments