Electric Scooters: మంచి మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి.

Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. బడ్జెట్, అవసరానికి అనుగుణంగా స్కూటర్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.

Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. బడ్జెట్, అవసరానికి అనుగుణంగా స్కూటర్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.

ఇండియాలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో బడ్జెట్, అవసరానికి అనుగుణంగా స్కూటర్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బజాజ్ ఆటో చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది మంచి క్లాసిక్ డిజైన్ ని కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కువ మంది కొనుగోలు చెయ్యడానికి ఇష్టపడతారు. ఈ స్కూటర్ ని ఫుల్ గా ఛార్జ్ చేస్తే ఏకంగా 137 కిమీ రేంజిని ఇస్తుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 73 కిమీ ఉంటుంది. ఈ స్కూటర్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను కలిగి ఉంది. దీని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ 6.7 kW మోటార్ పవర్‌ తో వస్తుంది. ఈ స్కూటర్‌ ఎకో, స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. యాప్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 5 అంగుళాల TFT స్క్రీన్ కూడా దీనికి ఉంది. ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర వచ్చేసి రూ. 1,15,018/- ఉంటుంది.

ఇక సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా అక్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్ డిజైన్‌తో కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది అదిరిపోయే లాంగ్ రేంజ్ ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 150 కిమీల వరకు రేంజ్ని అందిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. ఈ బైక్ 3.1 kWh లిథియం బ్యాటరీని కలిగి ఉంది. దీని బ్యాటరీ ఫైర్ రెసిస్టెంట్. ఈ స్కూటర్ మాక్సిమం స్పీడ్ గంటకు 70 కి.మీ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,04,890/- ఉంటుంది. ఇక హీరో ఎలక్ట్రిక్ Optima CX 5.0 కూడా సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకటి. ఇది రోజువారీ పనులకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. ఈ స్కూటర్ 3 kWh బ్యాటరీ పవర్ ని కలిగి ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 135 కిమీ రేంజ్ ఇస్తుంది. దీని మాక్సిమం స్పీడ్ గంటకు 55 కిమీ ఉంటుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి మొత్తం 6.5 గంటలు పడుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. ఇది 1,04,360/- ఉంటుంది. ఇక ఈ సూపర్ స్కూటర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments