iDreamPost
android-app
ios-app

సేల్స్ లో రికార్డ్.. 330 కి.మీ రేంజ్‌ Bajaj సీఎన్‌జీ బైక్.. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేది ఎప్పుడంటే?

  • Published Sep 28, 2024 | 10:02 PM Updated Updated Sep 28, 2024 | 10:02 PM

Bajaj Freedom 125: ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్ గా బజాజ్ ఫ్రీడమ్‌ బైక్‌ వచ్చింది. రావడంతోనే మార్కెట్‌లో దూసుకెళ్తుంది.

Bajaj Freedom 125: ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్ గా బజాజ్ ఫ్రీడమ్‌ బైక్‌ వచ్చింది. రావడంతోనే మార్కెట్‌లో దూసుకెళ్తుంది.

సేల్స్ లో రికార్డ్.. 330 కి.మీ రేంజ్‌ Bajaj సీఎన్‌జీ బైక్.. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ గా బజాజ్ ఫ్రీడమ్‌ బైక్‌ వచ్చింది. రావడంతోనే మార్కెట్‌లో ఈ బైక్ దూసుకెళ్తుంది. ఈ స్టైలిష్ బైక్ అందుబాటు ధరకే రావడం వల్ల దీన్ని కొనడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది దేశంలోని 88 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్ సేల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మరిన్ని నగరాల్లో ప్రవేశపెట్టే పనిలో ఉంది బజాజ్ కంపెనీ. ఈ సీఎన్‌జీ బైక్‌ ఆగస్టులో అమ్మకాలు జరుపుకుంది. విడుదలకు ముందే ఈ బైక్ బుకింగ్స్‌లో దుమ్మురేపింది. ఒక్క ఆగస్ట్ లోనే ఏకంగా 9,215 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెలలో బజాజ్ నుంచి అత్యధికంగా అమ్ముడైన నాలుగో బైక్‌గా ఈ బైక్ నిలిచింది. దేశంలో పూర్తి స్థాయిలో ఈ బైక్స్‌ అందుబాటులోకి వస్తే సేల్స్‌ ఇంకా ఎక్కువ అవుతాయి. మార్కెట్లో సీఎన్‌జీ కార్లు చలామణి అవుతున్న టైంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే సీఎన్‌జీతో నడిచే తొలి బైక్ ఇదే కావడం విశేషం.

ఈ కొత్త బజాజ్ ఫ్రీడమ్ బైక్ విషయానికి వస్తే.. ఇది 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 9.5 ps పవర్ ని 9.7 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీని సీటు కింద 2 కిలోల సీఎన్‌జీ సిలిండర్‌ని ఫిక్స్ చేశారు. అలాగే 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ముందుంది. దీని సీఎన్‌జీ ట్యాంక్‌ని 11 సేఫ్టీ టెస్ట్‌ల్లో పరీక్షించారు. ఈ టెస్ట్‌లో బైక్‌ ఎలాంటి ఇబ్బందులకు గురికాలేదు. అలా అన్ని ఇబ్బందులు తట్టుకొని ఉండేలా ఈ బైక్‌ని డిజైన్‌ చేశారు. ఇది 330 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు, 2 కిలోల సీఎన్‌జీకి 200 కిలోమీటర్ల రేంజ్, పెట్రోల్ మోడ్‌లో 130 కి.మీ వరకు ఈ బైక్ రేంజ్ ని అందిస్తుంది. ఇది రోజువారీ డ్రైవింగ్ ఖర్చులను ఏకంగా 50 శాతం తగ్గిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను 26 శాతం తగ్గిస్తుంది. అందువల్ల ఈ బైక్‌ పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది. పెట్రోల్ 125 సీసీ బైక్ తో పోలిస్తే ఈ బైక్ తో 5 సంవత్సరాలలో రూ.75,000 వరకు ఇంధన ఖర్చులను ఆదా చేయవచ్చు. ఇక ఈ బైక్‌ని బుక్ చేసుకోవాలంటే రూ.1,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఇది డ్రమ్, డ్రమ్ ఎల్‌ఈడీ, డిస్క్‌ ఎల్ఈడీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

ఈ బైక్ బేసిక్ వేరియంట్‌ ధర రూ .95,055 ఉంటుంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .1.10 లక్షలుగా ఉంది. ఇది సీఎన్‌జీ స్పోర్టీ స్టైలింగ్, LED హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ, గ్రాఫిక్స్‌తో కూడిన డ్యూయల్ కలర్ స్కీమ్, ఫస్ట్-ఇన్-క్లాస్ లింక్డ్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ బ్రేకింగ్ ఆల్ డ్రమ్ వేరియంట్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది. ప్రస్తుతం దీని డెలివరీలు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇంకో రెండు వారాల్లో ఈ బైక్ రానుంది. ఇక ఈ బైక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobet