nagidream
Answer And Win Infinix Hot 50 5G Smartphone: ఉచితంగా 5జీ స్మార్ట్ ఫోన్ కావాలా? అందులోనూ ఐదేళ్ల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా బెస్ట్ గా పని చేసే ఫోన్ కావాలా? అయితే ఈ క్విజ్ పోటీలో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
Answer And Win Infinix Hot 50 5G Smartphone: ఉచితంగా 5జీ స్మార్ట్ ఫోన్ కావాలా? అందులోనూ ఐదేళ్ల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా బెస్ట్ గా పని చేసే ఫోన్ కావాలా? అయితే ఈ క్విజ్ పోటీలో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
nagidream
ఉచితంగా స్మార్ట్ ఫోన్ కావాలా? ఐతే ఈ క్విజ్ లో పాల్గొంటే మీరు 10 వేల రూపాయల విలువైన 5జీ స్మార్ట్ ఫోన్ ని గెలుచుకునే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. క్విజ్ లో కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే 5జీ స్మార్ట్ ఫోన్ ని గెలుచుకునే ఛాన్స్ పొందవచ్చు. ఇన్ఫినిక్స్ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ మోడల్ స్మార్ట్ ఫోన్ ని సెప్టెంబర్ 5న లాంఛ్ చేయబోతుంది. ఈ క్రమంలో ఒక క్విజ్ పోటీని నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో గెలిచిన విజేతకు స్మార్ట్ ఫోన్ ని ఇవ్వనుంది కంపెనీ. ఈ క్విజ్ లో పాల్గొనాలంటే ఇన్ఫినిక్స్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. కిందకు స్క్రోల్ చేసి.. ‘ఆన్సర్ అండ్ విన్ పార్టిసిపేట్’ మీద క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
గూగుల్ డాక్ ఫార్మ్ లో మీ మెయిల్ తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ పేరు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. కింద కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలి. సమాధానాలు వెబ్ సైట్ లో ఇన్ఫినిక్స్ హాట్ 50కి సంబంధించిన వెబ్ పేజ్ లో ఉంటాయి. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ప్రశ్నకు సరైన ఆప్షన్ ని ఎంచుకోవాలి. మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆఖరున మీ ఇన్స్టాగ్రామ్ ఐడీ ఇచ్చి.. ‘సెండ్ మీ ఏ కాపీ ఆఫ్ మై రెస్పాన్సెస్’ ఆప్షన్ ని ఎనేబుల్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. పార్టిసిపేట్ చేసినందుకు విజేతను సెప్టెంబర్ 20న ప్రకటిస్తారు.
ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఈ ఫోన్ ని లాంచ్ ఆఫర్ లో భాగంగా 10 వేల లోపు బడ్జెట్ లో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఐదేళ్ల పాటు స్మూత్ గా పని చేసేలా దీన్ని డిజైన్ చేసింది. సెగ్మెంట్ లో స్లిమ్మెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇది. ఇన్ఫినిక్స్ కంపెనీ 70+ దేశాల్లో ఉనికిని నెలకొల్పింది. భారతదేశంలో అతి పెద్ద సర్వీస్ నెట్వర్క్ కలిగిన బ్రాండ్స్ లో ఇన్ఫినిక్స్ రెండో స్థానంలో ఉంది. 1300+ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. 7.8 ఎంఎం థిక్ నెస్ తో వస్తుంది. టీయూవీ ఎస్యూడీ ఏ లెవల్ సర్టిఫికెట్ తో వస్తుంది. ఈ సర్టిఫికెట్ కి అర్ధం ఏంటంటే.. ఈ ఫోన్ ఐదేళ్ల పాటు నిర్విరామంగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో పని చేస్తుందని.
ఇప్పుడు ఏ ఫోన్ అయినా సరే ఏడాది తర్వాత పెర్ఫార్మెన్స్ పరంగా వీక్ అయిపోతుంది. కానీ ఇన్ఫినిక్స్ కంపెనీకి చెందిన హాట్ 50 ఫోన్ మాత్రం ఐదేళ్ల పాటు బెస్ట్ గా పని చేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 60 నెలల పాటు ఫ్లుయెన్సీ, విశ్వసనీయతలో రేటింగ్ దక్కించుకుంది. ఈ ఫోన్ లోని రేర్ కెమెరాలో ఐఎస్ఓ సెల్ సెన్సార్ ని ఉపయోగించారు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ని ఇచ్చారు. ఇది 1 టీబీ వరకూ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇది ఐపీ54 స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తుంది. తడి చేతులతో టచ్ చేసినా పని చేసేలా టచ్ స్క్రీన్ డిస్ప్లేని రూపొందించారు.