Dharani
Anant Ambani Radhika Merchant Wedding: ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి మరి కొన్ని రోజుల్లో జరగబోతుంది. ఈ క్రమంలో సంగీత్ వేడుకకు వారు ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. ఆ వివరాలు..
Anant Ambani Radhika Merchant Wedding: ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి మరి కొన్ని రోజుల్లో జరగబోతుంది. ఈ క్రమంలో సంగీత్ వేడుకకు వారు ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. ఆ వివరాలు..
Dharani
అంబానీ ఇంట వేడుక అంటే దేశమంతా ఆసక్తి చూపుతారు. ఆసియా కుబేరుడుగా పేరు తెచ్చుకుని.. లక్షల కోట్లకు యజమాని అయినా సరే.. సాంప్రదాయాలకు విలువ ఇస్తారు ముఖేష్ అంబానీ. ఇక వారి ఇంట జరిగే ఏ వేడుక అయినా సరే.. ఎంతో పద్దతిగా.. వారి ఆచారవ్యవహారలకు తగ్గట్టుగా.. ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ ఏడడుగులు వేయనున్నారు. ఈ ఏడాది రెండు సార్లు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి ముందు సంగీత్, మెహందీలతో పాటు గుజరాతీ సాంప్రదాయ వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా అనంత్-రాధికలు ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. ఆ వివరాలు..
త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహ తంతులో భాగంగా.. అంబానీ కుంటుంబం గతరాత్రి అంగరంగ వైభవంగా సంగీత్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సంగీత్ వేడుక వేళ అనంత్-రాధికలు ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుక కోసం వీరు మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన సాంప్రదాయ దుస్తులు ధరించి.. ధగధగ మెరిసిపోయారు. వీరు వేసుకున్న బట్టలను నిజమైన బంగారంతో తయారు చేశారని తెలిసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.
నిన్న రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన బంధ్ గాలా జాకెట్, ప్యాంట్ సెట్ ధరించగా.. రాధిక ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగాలో అందంగా ముస్తాబైంది. అబూ జానీ సందీప్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రకారం, అనంత్ ధరించిన జాకెట్ నిజమైన బంగారంతో తయారు చేశారు. పోనీటెయిల్‌లో కట్టిన జుట్టుతో అనంత్ సంగీత్ వేడుకకు ముస్తాబయ్యారు. ఇక రాధిక ధరించిన డ్రెస్‌ను మెరిసే స్వరోవ్స్కీ స్ఫటికాలు పొదిగి డిజైన్ చేశారు.
రాధిక లేత గోధుమ, బంగారు వర్ణంలో మెరిసే లెహంగా సెట్‌లో స్వరోవ్‌స్కీ స్ఫటికాలతో అలంకరించిన ఆఫ్-షోల్డర్ బ్లౌజ్, క్రాప్డ్ హెమ్‌తో అద్భుతమైన లెహాంగాను డిజైన్ చేశారు. సంగీత్ వేడుకలో వీరు ధరించిన దుస్తులే ప్రధాన ఆకర్షణగా నిలవగా.. వీటిని నిజమైన బంగారంతో తయారు చేశారనే వార్త.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అనంత్-రాధికల సంగీత్ వేడుక కోసం హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ విచ్చేసిన సంగతి తెలిసిందే.