జియో నుంచి కొత్త ప్లాన్! తక్కువ ధరకే 3 నెలల అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ఉచితం!

Reliance Jio: జియో టెలికాం రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో ఓ సంచలనం అని చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే కోట్లాదిమంది యూజర్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.

Reliance Jio: జియో టెలికాం రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో ఓ సంచలనం అని చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే కోట్లాదిమంది యూజర్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.

రిలయన్స్ జియో టెలికాం రంగంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో జియో ఓ సంచలనం అని చెప్పొచ్చు. తక్కువ కాలంలోనే కోట్లాదిమంది యూజర్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది జియో. లాంచ్ అయిన కొత్తలో ఫ్రీగా సిమ్ కార్డులు అందిస్తూ.. ఉచితంగా డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇస్తూ మిగతా కంపెనీలకు గట్టిపోటినిచ్చింది జియో.జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అందుబాటు ధరలో రీచార్జ్ ప్లాన్ లని తీసుకొస్తుంది. తాజాగా మరో రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో టారిఫ్ ధరలను పెంచింది. దాంతో జియో కస్టమర్లు నిరాశ చెందారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో జియో నుంచి చాలా మంది తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ కు మారారు.

తాజాగా మరో రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 84-రోజుల వ్యాలిడిటీ కావాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 479 ఉంటుంది. ఇది సుమారు మూడు నెలల పాటు కాల పరిమితిని అందిస్తుంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న లాంగ్ పీరియడ్ ప్లాన్ లో బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ లోకల్ ఇంకా అలాగే STD కాల్‌లు రెండింటినీ కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ ప్లాన్లో 84 రోజుల వ్యవధికి 6GB డేటా మాత్రమే వస్తుంది. కాల్స్ ఎక్కువగా మాట్లాడేవారికి ఈ ప్లాన్ చౌక ప్లాన్ అని చెప్పవచ్చు.

డేటా ఎక్కువగా కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉండదు. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం, అదనపు డేటా ప్యాక్‌లను విడిగా కొనుగోలు చెయ్యాలి.ఈ ప్లాన్ కాలింగ్ మరియు డేటాతో పాటు, ఈ ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల వ్యవధిలో 1,000 SMSలను అందిస్తుంది .84-రోజుల చెల్లుబాటు వ్యవధి గల ఈ ప్లాన్ ఎలాంటి అంతరాయాలు లేకుండా ఎక్కువ కాలం పాటు ఉండే ప్లాన్ కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. ఎక్కువ రోజులు కాల్స్ మాట్లాడలనుకునేవారికి ఈ ప్లాన్ నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక తాజాగా రిలయన్స్ జియో అందిస్తున్న ఈ రూ. 479 ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments