Swetha
మరి కొద్దీ రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులంతా టీవీ లకు అతుక్కుపోతారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వబోతుంది. ఇప్పటికే సామాన్యులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో జరుగుతున్న షో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరి కొద్దీ రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులంతా టీవీ లకు అతుక్కుపోతారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వబోతుంది. ఇప్పటికే సామాన్యులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో జరుగుతున్న షో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Swetha
మరి కొద్దీ రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులంతా టీవీ లకు అతుక్కుపోతారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వబోతుంది. ఇప్పటికే సామాన్యులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో జరుగుతున్న షో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సామాన్యుల నుంచి హౌస్ లోకి ఎవరు వెళ్తారా అనే ఉత్కంట అందరిలో ఉంది. ఇక వీరు కాకుండా హౌస్ లోకి సెలబ్రిటీస్ ఎవరు వస్తారా అనే ఎగ్జైట్మెంట్ మరో వైపు. ఆల్రెడీ కొందరి నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ కన్ఫర్మ్ గా ఎవరు అనేది తెలియదు. అయితే ఇప్పుడు ఈ సెలెబ్రిటీ లిస్ట్ లో ఓ సీరియల్ నటి నేమ్ వినిపిస్తుంది.
ఆ నటి ఎవరో కాదు.. బ్రహ్మముడి సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తున్న షర్మిత గౌడ. ఈ అమ్మడు బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి క్యారెక్టర్ లో మెప్పించింది. సీరియల్ లో నెగెటివ్ రోల్ లో అదరగొడుతున్న షర్మిత.. సోషల్ మీడియాలో మాత్రం స్వీట్ గా పోస్ట్స్ పెడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇపుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మరి కొద్దీ రోజుల్లో తెలిసిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇక ముందు ముందు షో నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.