iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి యువ సామ్రాట్! హర్షసాయిపై ఫైట్ బాగా పని చేసింది!

  • Published Aug 10, 2024 | 3:32 PM Updated Updated Aug 10, 2024 | 3:32 PM

YuvaSamrat Ravi- Bigg Boss Telugu Season 8 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు బాగా మాట్లాడేసుకుంటున్నారు. సెప్టెంబర్ నెల నుంచి బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతోంది. కంటెస్టెంట్స్ ఎవరు? ఎలా ఉండబోతోంది అంటూ ఊహాగానాలు చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యువ సామ్రాట్ పేరు బాగా వినిపిస్తోంది.

YuvaSamrat Ravi- Bigg Boss Telugu Season 8 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు బాగా మాట్లాడేసుకుంటున్నారు. సెప్టెంబర్ నెల నుంచి బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతోంది. కంటెస్టెంట్స్ ఎవరు? ఎలా ఉండబోతోంది అంటూ ఊహాగానాలు చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యువ సామ్రాట్ పేరు బాగా వినిపిస్తోంది.

  • Published Aug 10, 2024 | 3:32 PMUpdated Aug 10, 2024 | 3:32 PM
బిగ్ బాస్ లోకి యువ సామ్రాట్! హర్షసాయిపై ఫైట్ బాగా పని చేసింది!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి చాలానే బజ్ క్రియేట్ అయ్యింది. సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతోంది? ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తున్నారు? అసలు ఈసారి సీజన్ ఎలా ఉండబోతోంది? ఇలాంటి చాలానే వార్తలు, ఉహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఒక ఇంట్రెస్టింగ్ పేరు అయితే వినిపిస్తోంది. అతను మరెవరో కాదు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ యువ సామ్రాట్. అవును యువ సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం దాదాపుగా కన్ఫామ్ అని చెబుతున్నారు. అందుకు ప్రధానంగా హర్షా సాయిని టార్గెట్ చేసి ఫైట్ చేయడం కూడా ఒక కారణంగా కావచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హర్షా సాయిపై ఫైట్:

యువ సామ్రాట్ రవి గురించి తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ ఫాలో అయ్యే వారికి ఆయన సుపరిచితుడే. వివిధ అంశాలకు సంబంధించి ఆయన తన ఒపీనియన్స్ ని చెబుతూ ఉంటాడు. అవి కొన్నిసార్లు కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. ఇటీవల జరిగిన హర్షాసాయి మీద ఫైటే ఒక ఉదాహరణగా చెప్పచ్చు. హర్షాసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని యువ సామ్రాట్ తీవ్రంగా ఖండించాడు. అలా చేయడం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తెలుగులో చాలానే ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. సోషల్ మీడియా వీడియోలతో ఎంత పాపులర్ అయ్యాడో.. హర్షా సాయి ఎపిసోడ్ తో యువ సామ్రాట్ రవి అంత పాపులర్ అయ్యాడు. ఆ ఫేమే ఇప్పుడు బిగ్ బాస్ దాకా తీసుకొచ్చింది అంటున్నారు.

Ravi

ఇంక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో దాదాపుగా యువ సామ్రాట్ ఎంట్రీ అనేది ఫిక్స్ అయిపోయింది అంటూ జబర్దస్త్ ఆర్టిస్ట్- బిగ్ బాస్ రివ్యూవర్ మహిధర్ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్లపై తాను చేసిన వీడియోలో ఈ విషయాన్ని బలంగా చెప్పాడు. యువ సామ్రాట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అంటూ వెల్లడించాడు. అలాగే ఈసారి సీజన్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ కి సంబంధించి మాత్రమే కాకుండా.. సీజన్ కి సంబంధించి కూడా మహిధర్ కొన్ని లీకులు ఇచ్చాడు. ఈసారి కూడా గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. మొదట కొంతమంది కంటెస్టెంట్స్ ని లోపలికి పంపి.. ఆ తర్వాత మరో ఐదుగురు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ ని పంపుతారు అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి ఇద్దరు ఉంటారంట. అంతకు ముందు సీజన్స్ కి సంబంధించి కూడా ముగ్గురు కంటెస్టెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. యువ సామ్రాట్ రవి బిగ్ బాస్ లోకి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş