Tirupathi Rao
Bigg Boss 8- Vishnu Priya Doing Same Mistake: బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. అయితే విష్ణుప్రియ మాత్రం ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేస్తోంది. అసలు ఆ తప్పులు ఏంటో చూద్దాం.
Bigg Boss 8- Vishnu Priya Doing Same Mistake: బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. అయితే విష్ణుప్రియ మాత్రం ఒకే తప్పును మళ్లీ మళ్లీ చేస్తోంది. అసలు ఆ తప్పులు ఏంటో చూద్దాం.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఆడియన్స్ లో కాస్త ఆసక్తి అయితే పెరుగుతోంది. ఎందుకంటే హౌస్ లో గొడవలు, పంచాయితీలు, గ్రూప్ గేమ్స్ బాగానే జరుగుతున్నాయి. అయితే హౌస్ లో ఏం జరిగినా కూడా కొందరి పేర్లు మాత్రం కచ్చితంగా వైరల్ అవుతూ ఉంటాయి. వారిలో విష్ణుప్రియ కూడా ఒకరు. బయట ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. హైపర్ అని, లేడీ ఫైటర్ అని, ఆడ పులి అని చాలానే పేర్లు ఉన్నాయి. కానీ, హౌస్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం అసలు విష్ణుప్రియ అంటే ఏంటో చూస్తున్నారు. నిజంగా విష్ణుప్రియ మీద రెస్పెక్ట్ కూడా పెరుగుతోంది. అయితే తన ఆటకి సంబంధించి ఒక తప్పు మాత్రం పదే పదే చేస్తోంది. అసలు విష్ణు చేస్తున్న తప్పు ఏంటో చూద్దాం.
విష్ణుప్రియ హౌస్ లో ఫస్ట్ వీక్ ఎంతో రిజర్వ్డ్ గా ఉంది. చాలా తక్కువ సమయం మాత్రమే కనిపించింది. అసలు హౌస్ లో ఆట ఆడుతోందా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ, సోనియా పుణ్యమా అని విష్ణుప్రియ గాడిలో పడింది. సోనియా విషయంలో విష్ణు ప్రదర్శించిన మెచ్యురిటీకి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. ఎంత హుందాగా ప్రవర్తించిందో అంటూ ప్రశంసించారు. విష్ణుతో పెట్టుకున్నందుకు సోనియా చాలానే బ్యాడ్ అయ్యింది. ఆ తప్పు తెలుసుకుని ఇప్పుడు విష్ణుప్రియతో ప్యాచప్ అయ్యే పనిలో పడింది. అయితే విష్ణుప్రియ మాత్రం హౌస్ లో చేస్తున్న ప్రధానమైన తప్పు ఏంటి అంటే.. ఆమెను ఆమె తగ్గించుకోవడం. అవును.. ఆమెను ఆమె తక్కువ చేసుకుని చూపించుకుంటోంది. అదే విష్ణుప్రియ చేస్తున్న అసలు సిసలు తప్పు.
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని విష్ణునే స్వయంగా ఇస్తోంది. తన బ్రెయిన్ కి నత్తి ఉంది అని చెప్పింది. త్వరగా పదాలు దొరకవు అంటూ చెప్పుకొచ్చింది. ఆ మాటను నాగార్జున ఎన్నిసార్లు జోక్ చేశారో చూశాం. అలాగే హౌస్ లో ఉన్న వాళ్లు కూడా అలాంటి పదాలను కచ్చితంగా వాడుకుంటారు. అంతేకాకుండా నేను స్పెషల్ చైల్డ్ అంటూ చెప్పుకొచ్చింది. అంటే తనకు ఆలోచన, బుర్రని వాడటం రాదు అంటూ చెప్పుకుంటోంది. ఇవన్నీ తర్వాత హౌస్ లో తనకు వచ్చే అవకాశాల మీద దెబ్బ కొడతాయి.
ఏదైనా టాస్క్ వస్తే విష్ణు వద్దులే నువ్వు బుర్ర పెట్టలేవు అంటారు. అలాగే ఈ మాటలను ఆసరగా తీసుకుని నామినేషన్స్ లో కూడా పెట్టచ్చు. ఇలా తనపై సంధించేందుకు అస్త్రాలను విష్ణునే స్వయంగా ఇస్తోంది. తనలో ఉన్న లోపాలను ఎదుటి వారికి చెప్పుకుంటూ తన ఆటను తానే తక్కువ చేసుకుంటోంది. ఈ తప్పును వెంటనే విష్ణుప్రియ మార్చుకుంటే బాగుంటుంది. లేదంటే అదే ఆమెను హౌస్ లో వీక్ కంటెస్టెంట్ గా మారేలా చేస్తుంది. కాబట్టి విష్ణుప్రియ ఆ తప్పును రిపీట్ చేయకుంటే ఉంటే బాగుంటుంది. మరి.. విష్ణుప్రియ ఆట మీకు ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.