iDreamPost
android-app
ios-app

మరికొద్ది గంటల్లో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షురూ..

  • Published Sep 01, 2024 | 12:34 PM Updated Updated Sep 01, 2024 | 12:34 PM

Bigg Boss Season 8 Telugu: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏడు సీజన్స్ ను విజవంతంగా పూర్తి చేసుకుని.. తాజాగా 8వ సీజన్ కు శ్రీకారం చుట్టేసింది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ స్టార్ట్ అవ్వనుంది.

Bigg Boss Season 8 Telugu: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏడు సీజన్స్ ను విజవంతంగా పూర్తి చేసుకుని.. తాజాగా 8వ సీజన్ కు శ్రీకారం చుట్టేసింది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ స్టార్ట్ అవ్వనుంది.

  • Published Sep 01, 2024 | 12:34 PMUpdated Sep 01, 2024 | 12:34 PM
మరికొద్ది గంటల్లో తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షురూ..

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికే వివిధ భాషల్లో ఈ షో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను టీవీ లకు కట్టిపడేస్తుంది. మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్ ను మిస్ చేయకుండా ఫాలో అయ్యే ప్రేక్షకులు కూడా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ కు ఇంకాస్త ఎక్కువ ఫాలోయింగ్ ఏ ఉంటుంది. దీనికి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో.. ఆల్రెడీ గత సీజన్ లో చూసాము. ఇప్పటీకే తెలుగు బిగ్ బాస్ విజయవంతంగా ఏడు సీజన్స్ ను పూర్తి చేసుకుని.. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 కు శ్రీకారం చుట్టింది. మరికొద్ది గంటల్లో ప్రేక్షకులను అలరించడానికి ఎంతో మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టనున్నారు.

గత కొన్ని రోజులుగా.. సోషల్ మీడియా లో, టెలివిజన్ లో బిగ్ బాస్ కు సంబంధించిన అప్ డేట్స్ వింటూనే ఉన్నాము. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో లు, ట్రైలర్ లు ఈసారి లిమిట్ లెస్ అంటూ వచ్చిన డైలాగ్స్ .. బిగ్ బాస్ మీద అంచనాలను అంతకు మించి పెంచేసింది. దీనితో అభిమానులు ఈసారి సీజన్ లో ఎవరెవరు వస్తారా.. ఎలా ఉండబోతుంది.. గత సీజన్ కు.. ఈ సీజన్ కు ఎలాంటి చేంజస్ చేసి ఉంటారు. ఇలా చాలా ప్రశ్నలతో షో టెలికాస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 .. సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు మొదలు కాబోతున్నట్లు.. తాజాగా ఓ ట్రైలర్ ను రీలిజ్ చేశారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కాకుండా మొదటి గెస్ట్ గా నాని రావడం విశేషం. మరి ఇంకెంత మంది గెస్ట్స్ రాబోతున్నారో.. కంటెస్టెంట్స్ ఎలాంటి పెరఫార్మెన్స్ తో హౌస్ లోకి అడుగుపెట్టనున్నారో.. తెలియాలంటే .. సాయంత్రం 7 గంటలకు ఈ షో చూడాల్సిందే.

ఇప్పటి వరకు వినిపిస్తున్న టాక్ ప్రకారం. టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం, రీతూ చౌదరి , యాంకర్ విష్ణుప్రియ, ఆర్జే శేఖర్ బాషా , బెజవాడ బేబక్క , బుల్లితెర హీరో నిఖిల్ మలియక్కల్ , డ్యాన్సర్ నైనికా, బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత ,టాలీవుడ్ హీరోయిన్ విస్మయశ్రీ, టాలీవుడ్ యంగ్ హీరో అభీరామ్ వర్మ , బుల్లితెర ఆర్టిస్ట్ నాగమణికంఠ ఇక వీరితో పాటు రాకింగ్ రాకేష్ పేరు కూడా వినిపిస్తుంది. వీరే వస్తారా లేదా ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేసేలా ఇంకా ఎవరైనా వస్తారా.. అనేదే ఇంకాసేపటిలో కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పటివరకు అయితే షో మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి వచ్చే కంటెస్టెంట్స్ ని బట్టి ఈ షో డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet