iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తు పట్టారా? బిగ్ బాస్ హౌస్‌లో రఫ్పాడించేస్తోంది..

  • Published Sep 17, 2024 | 7:00 AM Updated Updated Sep 17, 2024 | 7:00 AM

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప.. బుల్లితెరపై స్టార్ యాక్ట్రెస్. కన్నడ నుండి వచ్చిన ఈ చందన సీమ.. ఫేమస్ సీరియల్లో నటించింది. ఇప్పుడు.. బిగ్ బాస్ హౌస్‌లో రఫ్పాడించేస్తోంది..

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాప.. బుల్లితెరపై స్టార్ యాక్ట్రెస్. కన్నడ నుండి వచ్చిన ఈ చందన సీమ.. ఫేమస్ సీరియల్లో నటించింది. ఇప్పుడు.. బిగ్ బాస్ హౌస్‌లో రఫ్పాడించేస్తోంది..

  • Published Sep 17, 2024 | 7:00 AMUpdated Sep 17, 2024 | 7:00 AM
ఈ చిన్నారిని గుర్తు పట్టారా? బిగ్ బాస్ హౌస్‌లో రఫ్పాడించేస్తోంది..

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నది.. బుల్లితెర నటి. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి.. టాలీవుడ్ స్మాల్ స్క్రీన్‌పై సందడి చేస్తుంది. రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సీరియల్లో తన క్యూట్ నటనతో మహిళా ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మాయి.. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి శివంగిలా ఆడుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. యష్మీ గౌడ. బిగ్ బాస్ సీజన్ 8లో తన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది ఆమె. తొలి వారంలో ఊహించని విధంగా కెప్టెన్ అయిన యష్మీ.. సెకండ్ వీక్ వచ్చేసరికి ఓ టాస్క్ విషయంలో బయాస్‌గా వ్యవహరించి నాగార్జునతో చీవాట్లు తిన్నది. నాగ మణికంఠపై అబ్యూస్ వర్డ్స్ వినియోగించి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. టీవీ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఈ యష్మీగౌడ ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

యష్మీ గౌడ స్వస్థలం కర్ణాటక రాజధాని బెంగళూరు. ఆమె తండ్రి రమేష్.. బిజినెస్ మ్యాన్. తల్లి విజయలక్ష్మీ హోమ్ మేకర్. యష్మీ గౌడ చిన్నతనం నుండి ఎక్స్ ట్రా కర్కిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేది. స్కూల్ డేస్ నుంచి డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసింది. బెంగళూరులోని ‘దయానంద్‌ సాగర్‌ ఇనిస్టిట్యూట్‌’లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివినప్పటికీ… కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేసింది యష్మీ. అందాల పోటీల్లో ‘మిస్‌ ఫొటోజెనిక్‌’,’మిస్‌ మైసూర్‌’ టైటిల్స్ గెలుచుకుంది. మెల్లిగా ఎంటర్ టైన్ మెంట్ రంగంపై దృష్టి సారించింది. స్నేహితుల సలహాతో సీరియల్లోకి అడుగుపెట్టింది. విద్యా వినాయక అనే కన్నడ సీరియల్ చేసింది. ‘స్వాతి చినుకులు’లో తెలుగు బుల్లితెరకు పరిచమైంది.  అందులో వెనిలాగా నటించింది. ఈ సీరియల్లో మంచి పేరు వచ్చింది.

ఆ తర్వాత జీ తెలుగులో నాగ భైరవి సీరియల్లో నటించింది. ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కీ రోల్ పోషించింది. ఈ ధారావాహిక తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్ చేసింది యష్మీ. 2022లో ప్రారంభమైన ఈ సీరియల్.. ఈ ఏడాది జూన్‌లో ఎండింగ్ అయ్యింది. ఇందులో ముకుంద క్యారెక్టర్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అదే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఇటు షిఫ్ట్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్‌కు రాకముందు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది యష్మీ. ఆమెకు చాలా కోపం వల్ల.. అది మార్చుకునేందుకు వస్తున్నట్లు చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నాటి నుండి ఇతర కంటెస్టెంట్లను రప్పాడించేస్తుంది. టాప్ 5లో నిలిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Y A S H M I G O W D A (@yashmigowda)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio