iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి పండగే.. బిగ్ బాస్Bigg Boss లోకి రిషి సార్, వసుధర జంట!

  • Published Aug 11, 2024 | 4:41 PM Updated Updated Aug 11, 2024 | 4:41 PM

Rishi, Vasudhara-Bigg Boss: గుప్పెడంత మనసు అభిమానులకు ఇది పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. రిషిధార జంట బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

Rishi, Vasudhara-Bigg Boss: గుప్పెడంత మనసు అభిమానులకు ఇది పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. రిషిధార జంట బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.

  • Published Aug 11, 2024 | 4:41 PMUpdated Aug 11, 2024 | 4:41 PM
ఫ్యాన్స్ కి పండగే.. బిగ్ బాస్Bigg Boss లోకి రిషి సార్, వసుధర జంట!

మన దగ్గర సినిమాలకు మించిన ఆదరణ సీరియల్స్ కి ఉంది. మూవీ అయితే మూడు గంటలు మాత్రమే ఉంటుంది. అదే సీరియల్ అయితే ఏళ్ల తరబడి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అందుకే మన దగ్గర సీరియల్స్ కి విపరీతమైన క్రేజ్. అయితే అన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఆదరించలేవు. ఇక టాప్ రేటింగ్ దక్కించుకున్న సీరియల్స్ ను ఏళ్ల తరబడి కొనసాగిస్తారు. అలాంటి సీరియల్ లోని నటీనటులను తమ కుటుంబ సభ్యుల్లానే ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం బుల్లితెర మీద టెలికాస్ట్ అవుతోన్న సీరియల్స్ స్టార్ మా లో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్ తో పాటుగా హీరోహీరోయిన్లకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో వసుధార ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ జోడి బిగ్ బాస్ లో సందడి చేయనుందని సమాచారం.

త్వరలోనే గుప్పెడంత మనసు సీరయల్ కి శుభం కార్డు పడనుంది. నేటితో ఈ సీరియల్‌ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సీరియల్ ని ఇంత త్వరగా ముగించడానికి కారణం బిగ్ బాస్ షో అని తెలుస్తోంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ప్రారంభం అయ్యి ఇప్పటికి నాలుగేళ్లు అవుతుంది. 2020 డిసెంబర్ లో గుప్పెడంత మనసు సీరియల్ ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 1150 ఎపిసోడ్‌లు ప్రసారం చేశారు. ఈ సీరియల్ కి ప్రాణం అంటే రిషి, వసుధారలే. ఇక సీరియల్ ని మరి కొన్ని రోజులు పొడిగించేందుకు స్కోప్ ఉన్నా.. దీన్ని అర్ధాంతరంగా ముగించనున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ అని తెలుస్తోంది.

Rishidhara into Biggboss

త్వరలోనే తెలుగుతో పాటు కన్నడలోనూ బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతుంది. కన్నడ సీజన్ 11 లో బిగ్ బాస్‌కి రిషి అలియాస్ ముకేష్ గౌడ కంటెస్టెంట్‌గా వెళ్తుండటంతో.. ‘గుప్పెడంత మనసు’ని హడావిడిగా క్లోజ్ చేశారని తెలుస్తోంది. అలానే తెలుగు బిగ్ బాస్ 8లో వసుధార అలాయాస్ రక్షగౌడ కంటెస్టెంట్ గా రాబోతుందని తెలుస్తోంది. అందుకే ఈ సీరియల్ ని ఇంత త్వరగా ముగిస్తున్నారని సమాచారం.

గుప్పెడంత మనసు సీరియల్ కి రిషి, వసుధార పాత్రలే ప్రాణం. ఇప్పుడు వాళ్ల ప్లేస్‌లో కొత్త వాళ్లని తీసుకుని వస్తే.. కథలో సోల్ మిస్ అవుతుంది. కాబట్టి.. కథ ముందుకు వెళ్లాలంటే.. రిషి, వసుధారలు ఉండాల్సిందే. వాళ్లిద్దరిలో ఎవరు లేకపోయినా గుప్పెడంత మనసు సీరియల్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. రిషిధారలకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వాళ్లు లేకుండా సీరియల్ కొనసాగడం కష్టం అని భావించిన మేకర్స్ ఈ సీరియల్ కు శుభం కార్డు వేశారని సమాచారం.