iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8లోకి రాజ్ తరుణ్ మిత్రుడు శేఖర్ బాషా?

  • Published Aug 27, 2024 | 2:56 PM Updated Updated Aug 27, 2024 | 2:56 PM

Raj Tarun Friend Shekar Basha- Bigg Boss Telugu Season 8 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి చాలా గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. దానిని రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వస్తున్నాయి.

Raj Tarun Friend Shekar Basha- Bigg Boss Telugu Season 8 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి చాలా గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. దానిని రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వస్తున్నాయి.

  • Published Aug 27, 2024 | 2:56 PMUpdated Aug 27, 2024 | 2:56 PM
బిగ్ బాస్ 8లోకి రాజ్ తరుణ్ మిత్రుడు శేఖర్ బాషా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావడానికి ఇంకా నాలుగురోజుల సమయమే ఉంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటల నుంచి ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మొదలవుతుంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ షో మీద అంచనాలు మాత్రమే కాదు.. వార్తలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ పేరు వినిపిస్తోంది. అతను హౌస్ లోకి రావాలి అని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. అతను మరెవరో కాదు.. హీరో రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా. ఇప్పడు ఇతని పేరు బాగా వినిపిస్తోంది.

లావణ్యపై ఫైట్ తో ఫేమస్:

ఇటీవల హీరో రాజ్ తరుణ్- అతని మాజీ ప్రేయసి లావణ్య గొడవలు, కేసులు జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవలు మొదలైనప్పటి నుంచి శేఖర్ బాషా తన మిత్రుడు రాజ్ తరుణ్ కు మద్దతుగా నిలిచాడు. లావణ్య చెప్పేవి అన్నీ అబద్ధాలు అంటూ అతను వాదిస్తూనే ఉన్నాడు. తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఒక టీవీ డిబేట్ లైవ్ లోనే ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పరం కేసులు కూడా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శేఖర్ బాషా పేరు బాగా వైరల్ కావడమే కాకుండా.. ఎక్కువ వార్తలు, సోషల్ మీడియాలో కూడా కనిపించింది.

Sekhar Basha into BiggBoss3

సాధారణంగా బిగ్ బాస్ వచ్చే సమయానికి ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఉంటారో.. ఎవరి గురించి అయితే ఎక్కువగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారో అలాంటి వాళ్లని తీసుకునే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. శేఖర్ బాషా పేరు ఈ కొన్ని రోజుల్లో సోషల్ మీడియాలో బాగా నలిగింది. అలాగే కావాల్సినంత డ్రామా క్రియేట్ చేసే స్కోప్ కూడా ఉంది. అందుకే శేఖర్ బాషా పేరు రాగానే అందరూ కచ్చితంగా హౌస్ లోకి వెళ్తాడు అని భావిస్తున్నారు. ప్రస్తుతానికి శేఖర్ బాషా పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ హౌస్ లోకి వెళ్లాక ఈ ఇష్యూ గురించి ఏమైనా ఓపెన్ కామెంట్స్ చేస్తాడా? అంటే కష్టమనే చెప్పాలి.

అయితే ఇప్పటి వరకు ఇది కేవలం గాసిప్ మాత్రమే. ఈ లిస్ట్ లో ఇంకా చాలామంది పేర్లు అయితే ఉన్నాయి. ప్రముఖంగా అలీ సోదరుడు ఖయ్యూమ్, ఇంద్రనీల్, యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి, బెజవాడ బేబక్క, డ్యాన్సర్ నైనిక, హీరోయిన్ విస్మయ, సౌమ్యరావ్, యష్మీ గౌడ, తేజశ్వినీ గౌడ, ఆదిత్య ఓం, అంజలి పవన్, సాకేత్, అభిరామ్ వర్మ, యువసామ్రాట్ రవి వంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి.. శేఖర్ బాషా బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet